ఏపీకి వచ్చేస్తోన్న కుంకీ ఏనుగులు, పూలతో స్వాగతం పలికిన పవన్ కల్యాణ్-kumki elephants arrive in andhra pradesh pawan kalyan welcomes with flowers ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఏపీకి వచ్చేస్తోన్న కుంకీ ఏనుగులు, పూలతో స్వాగతం పలికిన పవన్ కల్యాణ్

ఏపీకి వచ్చేస్తోన్న కుంకీ ఏనుగులు, పూలతో స్వాగతం పలికిన పవన్ కల్యాణ్

Published May 21, 2025 07:40 PM IST Bandaru Satyaprasad
Published May 21, 2025 07:40 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్ణాటక నాలుగు కుంకీ ఏనుగులను అందజేసింది. బెంగళూరులోని కర్ణాటక విధాన సౌధ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్, మంత్రి ఈశ్వర్ ఖండ్రే కుంకీ ఏనుగులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో అధికారులకు అందించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్ణాటక నాలుగు కుంకీ ఏనుగులను అందజేసింది. మొత్తం ఆరు కుంకీ ఏనుగులు ఇవ్వవలసి ఉండగా, రెండు ఏనుగులను వాటి ఆరోగ్య కారణాలు, శిక్షణ పూర్తి కాకపోవడం కారణాల వల్ల మరో దఫా అందజేయనున్నట్టు కర్ణాటక ప్రభుత్వం తెలియచేసింది.

(1 / 9)

ఇవాళ బెంగళూరులోని కర్ణాటక విధాన సౌధ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్, మంత్రి ఈశ్వర్ ఖండ్రే కుంకీ ఏనుగులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో అటవీ అధికారులకు అందించారు.

(2 / 9)

కుంకీ ఏనుగుల అప్పగింతకు సంబంధించిన ఒప్పంద పత్రాలను, లైసెన్స్ లు, వాటి సంరక్షణకు సంబంధించిన విధివిధానాల పత్రాలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పవన్ కల్యాణ్ కు అందజేశారు.

(3 / 9)

శాస్త్రోక్తంగా గజ పూజ నిర్వహించిన అనంతరం జెండా ఊపుతూ కర్ణాటక ప్రభుత్వాధినేతలు కుంకీలను సాగనంపగా, పూల వర్షం కురిపిస్తూ పవన్ కల్యాణ్ ఆహ్వానం పలికారు. ఈ నాలుగు ఏనుగులను కర్ణాటక అటవీశాఖ అధికారుల నుంచి ఆంధ్రప్రదేశ్ అటవీ అధికారులు అధికారికంగా స్వీకరించారు.

(4 / 9)

పవన్ కల్యాణ్ ను సన్మానిస్తున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

(5 / 9)

పవన్ కల్యాణ్ ను సన్మానిస్తున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

దేవా, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర అనే పేర్లు కలిగిన కుంకీ ఏనుగులు ఆంధ్రప్రదేశ్ కి అప్పగించారు. కర్ణాటకకు చెందిన మావటీలు రెండు నెలలపాటు కుంకీ ఏనుగులతో ఉండి ఆంధ్రప్రదేశ్ మావటీలకు వాటి సంరక్షణ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు.

(6 / 9)

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పవన్ కల్యాణ్ సరదా సంభాషణ

(7 / 9)

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పవన్ కల్యాణ్ సరదా సంభాషణ

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పవన్ కల్యాణ్

(8 / 9)

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని ఏనుగులు ఇవ్వడానికీ సిద్ధమని ఈ సందర్భంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కర్ణాటక ఇచ్చిన కుంకీ ఏనుగుల ఆరోగ్య సంరక్షణ బాధ్యతను ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు.

(9 / 9)

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు