
(1 / 4)
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ రావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, లాక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, పార్టీ నేతలు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి బస్ భవన్ చేరుకున్నారు.

(2 / 4)
రేతిఫైల్ బస్ స్టేషన్ నుంచి బస్ భవన్ కు ఆర్టీసీ బస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటుగా ముఖ్యనేతలు ప్రయాణించారు. అనంతరం బస్ భవన్‌లో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి గారికి వినతి పత్రం అందజేశారు.

(3 / 4)
గ్రేటర్ పరిధిలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. ఈ మేరకు బీఆర్‌ఎస్ తరఫున లేఖ అందజేశారు. ప్రభుత్వ బకాయిల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

(4 / 4)
రూ. 1353 కోట్లు 'మహాలక్ష్మి' ఉచిత బస్సు పథకం బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. కేసీఆర్ హయాంలో రూ. 9246 కోట్ల ఆర్టీసీ గ్రాంట్‌ను(TGSRTC కింద) విడుదల చేసినట్టు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని ముంచేలా చేసి, ప్రైవేట్‌కు అప్పగించే కుట్ర చేస్తున్నదని ఆరోపించారు.
ఇతర గ్యాలరీలు