(1 / 7)
కృతి సనన్ లేటెస్ట్ మూవీ తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో బ్యాక్ టు బ్యాక్ అద్భుతమైన ప్రమోషనల్ లుక్స్‌తో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. ఒక్కరోజు ముందే నీలిరంగు మినీ డ్రెస్సులో గ్లామర్ లుక్‌తో అలరించిన కృతి సనన్ తాజాగా బెల్ బాటమ్ జంప్ సూట్ లో ఆకట్టుకుంది.
(2 / 7)
లేటెస్టుగా తన అభిమానులకు ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది కృతి సనన్. బ్లూ డ్రెస్‌లో బ్లాక్ హార్ట్ ఎమోటికాన్‌తో ఫోటోషూట్‌కు పోజులు ఇచ్చింది బ్యూటిఫుల్ కృతి సనన్. దీంతో ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
(3 / 7)
కృతి సనన్ వేసుకున్న జంప్‌సూట్ మిడ్ నైట్ బ్లూ కలర్లో ఉంది. ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ వన్ షోల్డర్ నెక్లైన్, బాడీకాన్ ఫిట్తోపాటు చిక్ బెల్-బాటమ్ స్టైల్ ట్రౌజర్ ధరించింది. దీంతో ఈ దుస్తులు పాతకాలపు వైబ్‌ని ఇచ్చాయి.
(4 / 7)
ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ సుకృతి గ్రోవర్ డిజైన్ చేసిన ఈ వేర్‌ను కృతి సనన్ ధరించింది. ఇందులో కృతి సనన్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. అలాగే కృతి నడుము చుట్టూ సొగసైన బ్యాక్ బెల్ట్ ధరించి, మోనోక్రోమటిక్ దుస్తులను మరింత ప్రత్యేకంగా చేసింది. దానితో పాటు కృతి చెవులకు చేసిన మెరిసే బంగారు హోప్స్ కూడా అట్రాక్ట్ చేస్తున్నాయి.
(5 / 7)
కృతి సనన్ లేటెస్టుగా ఆకట్టుకుంటున్న ఫొటోల్లో ఆమెకు మేకప్ ఆర్టిస్ట్ ఆదిత్య శర్మ మరింత స్టైల్‌గా తయారు చేశాడు. బ్యూటిఫుల్ హీరోయిన్ కృతిని పింక్ ఐషాడో, మాస్కరా పూసిన కనురెప్పలు, ముదురు కనుబొమ్మలు, బ్లష్ బుగ్గలు, ప్రకాశవంతమైన హైలైటర్, లేత గులాబీ రంగు లిప్‌స్టిక్‌తో అలంకరించాడు.
(6 / 7)
హెయిర్ స్టైలిస్ట్ ఆసిఫ్ అహ్మద్ కృతి సనన్ హెయిర్ స్టైల్ చూసుకున్నాడు. హీరోయిన్ కృతి సనన్‌కు లూజ్ హెయిర్ లైట్ కర్ల్స్‌తో ఆమె స్టైలిష్ లుక్‌కి మరింత అందాన్ని తీసుకొచ్చాడు.
(7 / 7)
కృతి సనన్ తనదైన శైలీలో రెట్రో లుక్‌తో అట్రాక్ట్ చేసింది. కృతి సనన్లాగే ఇలాంటి బెల్ బాటమ్ అదే జంప్‌సూట్‌ను ఆర్డర్ చేయడం గురించి ఆలోచిస్తున్నారా! అయితే పెట్టేసేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ, ఎలాంటి సందర్భంలో అయిన ఈ దుస్తులు సరిపోతాయి.
ఇతర గ్యాలరీలు