Kotappakonda : మహా శివరాత్రికి ముస్తాబవుతున్న కోటప్పకొండ.. చరిత్ర, విశేషాలు తెలుసా?-kotappakonda temple history and interesting facts ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kotappakonda : మహా శివరాత్రికి ముస్తాబవుతున్న కోటప్పకొండ.. చరిత్ర, విశేషాలు తెలుసా?

Kotappakonda : మహా శివరాత్రికి ముస్తాబవుతున్న కోటప్పకొండ.. చరిత్ర, విశేషాలు తెలుసా?

Published Feb 10, 2025 11:13 AM IST Basani Shiva Kumar
Published Feb 10, 2025 11:13 AM IST

  • Kotappakonda : మహా శివరాత్రికి కోటప్పకొండ ముస్తాబవుతోంది. ఇది గుంటూరు జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం. దీనినే త్రికోటేశ్వరాలయం అని కూడా అంటారు. ప్రస్తుతం కొండపై సుందరీకరణ, వసతుల కల్పనకు చర్యలు చేపట్టారు. కోటప్పకొండ చరిత్ర, విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

దక్షయజ్ఞంలో జరిగిన అవమానం కారణంగా.. సతీదేవి దేహత్యాగం చేస్తుంది. సతీదేవి వియోగం తర్వాత పరమ శివుడు పిచ్చివాడై ముల్లోకాలు తిరుగుతుండగా.. కోటప్పకొండ శివుడిని ఆకర్షించి, ఆశ్రయమిచ్చింది. శివుడు బాల దక్షిణామూర్తి రూపంలో 12 సంవత్సరాలు ధ్యాన నిమగ్నుడై తపస్సు గావించిన పవిత్ర స్థలమే ఈ త్రికోటేశ్వరాలయం. 

(1 / 6)

ఈ ఆలయంలో మూడు శిఖరాలు ఉన్నాయి. అవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు చిహ్నంగా నిలుస్తాయి. ఈ కారణంగా దీనిని త్రికోటేశ్వరాలయం అని అంటారు. ఇక్కడ శివుడు దక్షిణామూర్తి అవతారంలో కొలువై ఉన్నాడు. ఇది చాలా విశిష్టమైన రూపం.

(2 / 6)

ఈ ఆలయంలో వివాహాలు జరగవు. ఎందుకంటే శివుడు ఇక్కడ బ్రహ్మచారిగా, దక్షిణామూర్తి రూపంలో ఉన్నాడు. ఈ కొండపై కాకులు వాలవు అని చెబుతారు. ఇది కూడా ఒక విశేషంగా చెబుతారు. 

(3 / 6)

ఇక్కడ మహా శివరాత్రి ఉత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవానికి హాజరవుతారు. కోటప్పకొండ ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడకు వెళ్లడం వల్ల భక్తులకు మానసిక ప్రశాంతి లభిస్తుంది.

(4 / 6)

ఈసారి తిరునాళ్లకు 20 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాలతో.. వసతులు కల్పిస్తున్నారు. దేవాలయ నిధుల నుంచి కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఉచిత, శీఘ్రదర్శనం, ప్రత్యేక దర్శనాలకు వేర్వేరు క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. వికలాంగులు, వయోవృద్ధుల కోసం లిఫ్ట్‌ సౌకర్యం అందుబాటులో ఉంది. 

(5 / 6)

భక్తులకు తాగునీరు, ప్రసాదాల పంపిణీ స్వచ్ఛంద సేవాసంస్థల సహకారంతో చేయనున్నారు. శానిటేషన్‌పై ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్నారు. భక్తులకు విక్రయించేందుకు 2 లక్షల లడ్డూలు, లక్ష అరిసెలు తయారు చేయిస్తున్నారు. తిరునాళ్ల రోజున అభిషేకాలు చేయించుకునేందుకు మండపంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు