Atreyapuram Boat Racing : కోనసీమలో కేరళ తరహా పోటీలు, ఆత్రేయపురంలో బోట్ రేసింగ్
Atreyapuram Boat Racing : ఏపీలో సంక్రాంతి జోష్ మామూలుగా లేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలి సంక్రాంతి కావడంతో అధికార కూటమి నేతలు కొత్త విన్యాసాలకు తెరలేపుతున్నారు. కేరళ అందాలను సొంత చేసుకున్న కోనసీమలో....కేరళ తరహాలో పడవ పోటీలు నిర్వహించారు.
(1 / 5)
ఏపీలో సంక్రాంతి జోష్ మామూలుగా లేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలి సంక్రాంతి కావడంతో అధికార కూటమి నేతలు కొత్త విన్యాసాలకు తెరలేపుతున్నారు. కేరళ అందాలను సొంత చేసుకున్న కోనసీమలో....కేరళ తరహాలో పడవ పోటీలు నిర్వహించారు. కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురంలో పడవ పోటీలు ప్రత్యేకంగా నిలిచాయి. వీటితో పాటు స్విమ్మింగ్ పోటీలు కూడా నిర్వహించారు.
(2 / 5)
మినీ కేరళగా పేరొందిన కోనసీమ జిల్లా ఎప్పుడూ ప్రత్యేకంగానే నిలుస్తోంది. అక్కడి ప్రజలు, నేతలు వేడుకల్లో తమ ప్రత్యేకతను చాటుకుంటారు. ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ అద్భుతంగా నిర్వహిస్తారు. ఈ పండుగను పురస్కరించుకుని అనేకనేక కొత్త కొత్త ఆలోచనలతో వేడుకలు నిర్వహిస్తున్నారు. కేరళ అందాలకు మాత్రమే కాదు, కేరళ సంప్రదాయ క్రీడలను సైతం వారసత్వంగా నిర్వహిస్తామని అక్కడి ప్రజా ప్రతినిధులు అంటున్నారు.
(3 / 5)
కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు ఆధ్వర్యంలో ఆత్రేయపురంలో కేరళ తరహా పడవ పోటీలు జరిగాయి. దీంతో పాటు స్విమ్మింగ్ పోటీలు కూడా జరిగాయి.
ఆత్రేయపురం మండలంలోని బొబ్బర్లంక మధ్య డెల్టా ప్రధాన పంట కాలువలో ఈ పోటీలు అంగరంగవైభవంగా జరిగాయి. వీటిని తిరకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
(4 / 5)
మూడు రోజుల పాటు జరిగే సర్ అర్థర్ కాటన్ గోదావరి ట్రోఫి సంక్రాంతి సంబరాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ ట్రోఫి ఉత్సవాలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పావురాలను ఎగురవేసి ప్రారంభించారు. స్విమ్మింగ్ పోటీలను ఎంపీ గంటి హరీష్ మాధుర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆత్రేయపురం రోడ్డు నుంచి అధిక సంఖ్యలో మహిళలు రంగవల్లులతో తమ నైపుణ్యానికి అద్దం పట్టారు. పతంగి పోటీల్లో తమ పతంగులను ఎగురవేశారు.
(5 / 5)
ప్రతి ఏటా ట్రోఫి పోటీలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే సత్యానందరావు తెలిపారు. ఈ పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. పోటీల్లో విజేతులకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ బహుమతులు అందజేశారు. అమెరికా నుంచి సంక్రాంతి పండుగకు స్వదేశానికి వచ్చిన 70 ఏళ్ల పైబడిన వృద్ధురాలు స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనడం విశేషంగా నిలిచింది.
(రిపోర్టింగ్ :జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
ఇతర గ్యాలరీలు