Jayam Ravi: ఇక నుంచి ఆ పేరుతోనే పిలవాలన్న తమిళ స్టార్ హీరో.. 22 ఏళ్ల తర్వాత మార్పు
- Jayam Ravi: తమిళ నటుడు జయం రవి.. పేరు మార్చుకున్నారు. తన ఒరిజినల్ పేరుతోనే పిలవాలని రిక్వెస్ట్ చేశారు. ఆ వివరాలివే..
- Jayam Ravi: తమిళ నటుడు జయం రవి.. పేరు మార్చుకున్నారు. తన ఒరిజినల్ పేరుతోనే పిలవాలని రిక్వెస్ట్ చేశారు. ఆ వివరాలివే..
(1 / 5)
తమిళ స్టార్ హీరో జయం రవి కీలక నిర్ణయం తీసుకున్నారు. సినీ ఇండస్ట్రీ ద్వారా వచ్చిన ఆ పేరును మార్చేసుకున్నారు. జయం రవి నుంచి మళ్లీ తన ఒరిజినల్ పేరుకు ఛేంజ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన నేడు (జనవరి 13) అధికారికంగా ప్రకటించారు.
(2 / 5)
జయం రవి అసలు రవి మోహన్. అయితే, ఆయన హీరోగా నటించిన తొలి చిత్రం ‘జయం’ 2003లో సూపర్ హిట్ అయింది. దీంతో తన పేరును జయం రవిగా మార్చుకున్నారు. అయితే, ఇప్పుడు 22 ఏళ్ల తర్వాత మళ్లీ పాత పేరుకు మారారు.
(3 / 5)
ఇక నుంచి తనను జయం రవి అని కాకుండా.. రవి మోహన్ అనే పిలవాలని నేడు ఓ లెటర్ రిలీజ్ చేశారు. తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితానికి రవి మోహన్ అనే పేరు బాగుంటుందనిపిస్తోందని పేర్కొన్నారు.
(4 / 5)
తన సొంత ప్రొడక్షన్ హౌస్‍ను రవి మోహన్ మొదలుపెట్టారు. రవి మోహన్ ప్రొడక్షన్స్ పేరుతో బ్యానర్ స్థాపించాడు. తన అభిమాన సంఘాలకు కూడా రవి మోహన్ అని పేరు మార్చాలని సూచించారు.
ఇతర గ్యాలరీలు