Oriental Pratincole : పగలంతా చెట్లపై సంధ్యా సమయంలో నీటి వద్దకు-కొల్లేరు అందాల అతిథి ఓరియంటల్ ప్రాటిన్‌కోల్
Oriental Pratincole : ఆ పక్షి పగలంతా చెట్లపైన ఉంటుంది. సంధ్యా సమయంలో నీటి వద్దకు చేరుకుంటుంది. అదే కొల్లేరు సరస్సులో అందాల అతిథిగా ఉన్న ఓరియంటల్ ప్రాటిన్‌కోల్. శీతాకాలంలో కొల్లేరుకు వచ్చే ఈ అతిథికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.
(1 / 7)
ఆ పక్షి పగలంతా చెట్లపైన ఉంటుంది. సంధ్యా సమయంలో నీటి వద్దకు చేరుకుంటుంది. అదే కొల్లేరు సరస్సులో అందాల అతిథిగా ఉన్న ఓరియంటల్ ప్రాటిన్‌కోల్. శీతాకాలంలో కొల్లేరుకు వచ్చే ఈ అతిథికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.
(2 / 7)
ఈ ఓరియంటల్ ప్రాటిన్‌కోల్ పక్షి ఇప్పుడు కొల్లేరు సరస్సుకు అతిథిగా ఉంది. ఏలూరు జిల్లాలోని కైకలూరులోని కొల్లేరు సరస్సులో ఈ అతిథి ప్రత్యక్షమైంది. సాధారణంగా ప్రతిఏటా దేశవిదేశాల నుంచి చాలా పక్షులు వస్తాయి.
(3 / 7)
నల్లటి చిట్టి ముక్కు, మెడ చుట్టూ బంగారు ఆభరణంలా ఉండే నల్లటి కంఠ హారంతో ఓరియంటల్ ప్రాటిన్‌కోల్ పక్షి ఉంటుంది. కాళ్లు పొట్టిగా పొడవాటి రెక్కలు, తోకతో.. శరీరమంతా గోధుమ వర్ణాన్ని కలిగిన ఈ పక్షి సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తుంది. రెక్కలు గోధుమ రంగులో, ఈకలు నల్లగా ఉంటాయి. పొట్ట భాగం తెల్లగా ఉంటుంది. కింద రెక్కలు చెస్ట్‌నట్‌గా ఉంటాయి.
(4 / 7)
ఈ పక్షి పావురం ఆకారంలో 23 నుంచి 25 సెంటీ మీటర్ల పొడవుతో 60-100 గ్రాముల బరువుతో ఉంటుంది. పురుగులు, కీటకాలు కోసం సాయంత్రం వేళల్లో సరస్సులు, నదులు వద్దకు వెళ్తాయి.
(5 / 7)
మనదేశంతో పాటు దక్షిణ ఆగ్నేసియాలోని వేడి ప్రాంతాల్లో ఈ పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇది ఆసియా ఖండానికి చెందిన పక్షి. ఓరియంటల్ ప్రాటిన్‌కోల్ (గ్లేరియోలా మాల్డివరమ్)ని గొల్లభామ, స్వాలో ఫ్లోవర్ అని కూడా పిలుస్తారు. ఈ పక్షి గ్లేరియోలిడే అనే ప్రాటిన్ కోల్ కుటుంబానికి చెందినది. జాతి పేరు లాటిన్ గ్లేరియాగా చెబుతున్నారు.
(6 / 7)
రెండు నుంచి మూడు గుడ్లు పెట్టి 14 రోజుల పాటు పొదిగి సంతానోత్పత్తి చేస్తాయి. పగలంతా చెట్లపై తిరుగుతూ సాయంత్రం వేళ నీటికి దగ్గరగా ఉంటూ పురుగులను వేటాడి ఆహారంగా తీసుకుంటాయి.
(7 / 7)
శీతాకాలంలో మనదేశంతో పాటు పాకిస్థాన్, ఇండోనేషియా, ఆస్ట్రేలియాకు వలస వస్తాయి. ఆశ్చర్యకరంగా ఈ జాతి గ్రేట్ బ్రిటన్‌కు దూరంగా ఉంటుంది. ఉత్తర పాకిస్తాన్, కాశ్మీర్ ప్రాంతం నుంచి సంతానోత్పత్తి చేస్తాయి. అప్పుడప్పుడు మాల్దీవులు, శ్రీలంక, ఇండిచైనా, తూర్పు చైనా, మంచూరియా, ఫిలిప్ఫీన్స్‌లో సంతానోత్పత్తి చేస్తాయి. ఈ జాతి పక్షులు కొల్లేరులో 500 వరకు ఉంటాయని అటవీ శాఖ తెలిపింది.(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
ఇతర గ్యాలరీలు