Greater Painted Snipe : గుడ్లను పొదిగే మగపక్షి, కొల్లేరు స‌ర‌స్సులో గ్రేట‌ర్ పెయింటెడ్ స్నిప్‌ సందడి-kolleru lake beautiful guest greater painted snipe male bird that incubates eggs ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Greater Painted Snipe : గుడ్లను పొదిగే మగపక్షి, కొల్లేరు స‌ర‌స్సులో గ్రేట‌ర్ పెయింటెడ్ స్నిప్‌ సందడి

Greater Painted Snipe : గుడ్లను పొదిగే మగపక్షి, కొల్లేరు స‌ర‌స్సులో గ్రేట‌ర్ పెయింటెడ్ స్నిప్‌ సందడి

Jan 19, 2025, 08:41 PM IST HT Telugu Desk
Jan 19, 2025, 08:41 PM , IST

Greater Painted Snipe : కొల్లేరు స‌ర‌స్సులో అందాల అతిథి గ్రేట‌ర్ పెయింటెడ్ స్నిప్ సందడి చేస్తుంది. వీటిల్లో కేవ‌లం గుడ్లు పెట్టడ‌మే ఆడ‌ప‌క్షి చేస్తోంది. వాటిని పొదిగి పిల్లల‌ను త‌యారు చేయ‌డం మ‌గ‌ప‌క్షి పని. అలాగే ఆ పిల్లల సంర‌క్షణ కూడా మ‌గ‌ప‌క్షే చూస్తుంది.

ఆడ‌ప‌క్షి గుడ్లు పెడుతోంది. పిల్లలను పొదగదు. ఆడపక్షి పెట్టిన గుడ్లను మ‌గ‌ప‌క్షి పొదిగి సంతానోత్పత్తి చేస్తోంది. ఈ ప‌క్షి మ‌రేదో కాదండీ కొల్లేరు స‌ర‌స్సులో అందాల అతిథి గ్రేట‌ర్ పెయింటెడ్ స్నిప్ సందడి చేస్తుంది. సాధార‌ణంగా సంతానోత్పత్తి చేసేవి ఆడ జాతులు. కానీ కేవ‌లం గుడ్లు పెట్టడ‌మే ఆడ‌ప‌క్షి చేస్తోంది. వాటిని పొదిగి పిల్లల‌ను త‌యారు చేయ‌డం మ‌గ‌ప‌క్షి చేస్తోంది. అలాగే ఆ పిల్లల సంర‌క్షణ కూడా మ‌గ‌ప‌క్షే చూస్తుంది. 

(1 / 9)

ఈ గ్రేట‌ర్ పెయింటెడ్ స్నిప్ పక్షి ఇప్పుడు కొల్లేరు స‌రస్సుకు అతిథిగా వస్తుంది. ఏలూరు జిల్లాలోని కైక‌లూరులో కొల్లేరు స‌ర‌స్సులో ఆ అతిథి ప్రత్యక్షమైంది. సాధార‌ణంగా ప్రతిఏటా చాలా ప‌క్షులు అక్కడికి వ‌స్తాయి. దేశ విదేశాల నుంచి కొల్లేరు స‌ర‌స్సు వ‌ద్దకు ప‌క్షులు వ‌చ్చి చేరుతాయి. 

(2 / 9)

అయితే లేత ఎరుపు గోధువ రంగులు మిళిత‌మైన పొడ‌వాటి ముక్కు కింద‌కు వంపు తిరిగి ఉండే గ్రేట‌ర్ పెయింటెడ్ స్నిప్ ప‌క్షి ఇప్పుడు కొల్లేరులో సందడి చేస్తుంది. న‌ల్లటి క‌ళ్లతో కంటిరెప్పల చుట్టూ తెల్లటి వ‌ల‌యం క‌లిగిన ఈ ప‌క్షి సంద‌ర్శకుల‌ను ఇట్టే ఆక‌ర్షిస్తుంది.

(3 / 9)

న‌లుపు వ‌క్కపొడి వ‌ర్ణాల‌తో మ‌చ్చల రెక్కలు, వెన్ను చుట్టూ తెలుపు రంగు చార‌తో క‌నువిందు చేస్తోంది గ్రేట‌ర్ పెయింటెడ్ స్నిప్ ప‌క్షి. ఇది 23 నుంచి 28 సెంటి మీట‌ర్ల (9.1 నుంచి 11 అంగుళాలు) పొడ‌వుతో 250 గ్రాముల బ‌రువు క‌లిగి ఉంటుంది. ఈ ప‌క్షులు చిత్తడి నేల‌లు, మంచినీటి చెరువులు, స‌ర‌స్సులు, న‌దులు గ‌డ్డి భూములు వంటి పెద్ద నీటి వ‌న‌రులుండే ప్రదేశాల్లో మాత్రమే క‌నిపిస్తాయి. 

(4 / 9)

ఆడ ప‌క్షి రెండు నుంచి ఐదు వ‌ర‌కు గుడ్లను పెడుతుంది. మ‌గ ప‌క్షులు ఆ గుడ్లను 18 నుంచి 19 రోజులు పొదుగుతాయి. పిల్లల‌ సంర‌క్షణ బాధ్యతను కూడా మ‌గ ప‌క్షులే తీసుకుంటాయి. ఈ ప‌క్షులు ఆహారంగా కీట‌కాలు, చిట్టి న‌త్తలు, వాన‌పాములు, క్రస్టేసియా, విత్తనాల‌ను తీసుకుంటాయి. ఇవి ఉద‌యం, సంధ్యా స‌మ‌యంలోనే ఆహారం తీసుకుంటాయి.

(5 / 9)

ప్రస్తుతం కొల్లేరులో ఈ జాతి ప‌క్షులు 15 వంద‌ల వ‌ర‌కు ఉంటాయ‌ని అట‌వీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గ్రేట‌ర్ పెయింటెడ్ స్నిప్‌ను రోస్ట్రాటులా బెంఘాలెన్సిస్ అంటారు. ఇది రోస్ట్రాటులిడే అనే చిన్న పెయింటెడ్ స్నిప్ కుటుంబంలోని వాడేర్ జాతి ప‌క్షి. ఇది ఆఫ్రికా, దక్షిణ ఆసియా అంత‌టా ఉంటాయి.

(6 / 9)

ఈ జాతి లైంగికంగా డైమోర్ఫిక్‌గా ఉంటుంది. ఆడ‌ది మ‌గ కంటే పెద్దదిగా, ప్రకాశ‌వంత‌మైన రంగులో ఉంటుంది. అలాగే బ‌రువైన‌వి. ఆడ‌ది సాధార‌ణంగా బ‌హుల‌జాతిగా ఉంటుంది. మ‌గ ప‌క్షి గుడ్లను పొదిగి, పిల్లల‌ను సంర‌క్షిస్తోంది. ఒక న‌ల్లటి త‌ల‌తో బ‌ఫ్ స్ట్రిప్, తెల్లటి కంటి పాచ్ క‌లిగి ఉంటుంది.

(7 / 9)

ఈ ప‌క్షి స్వర జాతికి చెందింది కాదు. ఇది చాలా వ‌ర‌కు నిశ్శబ్దంగా ఉంటుంది. సంతానోత్పత్తి కాలంలో కొద్దిగా అరుస్తోంది. ఆడ ప‌క్షి మెల్లో హూటింగ్ లేదా బూమింగ్ శ‌బ్దం చేస్తోంది. 

(8 / 9)

ఈ ప‌క్షిని అధికారికంగా 1758లో స్వీడిష్ ప్రకృతి శాస్త్రవేత్త కార్ల్ లిన్నెయ‌స్ త‌న సిస్టమా నేచురే ప‌దో ఎడిష‌న్‌లో వివ‌రించారు. గ్రేట‌ర్ పెయింటెడ్ స్నిప్ ఆస్ట్రేలియన్ పెయింటెడ్ స్పిప్‌ని రోస్ట్రాటులా జాతికి చెందిద‌ని ఫ్రెంచ్ ప‌క్షి శాస్త్రవేత్త లూయిస్ విల‌యోల్లోట్ 1816లో ప‌రిచ‌యం చేశారు.(రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌రజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)  

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు