(1 / 5)
వారం రోజుల్లోనే టీమిండియా ఇద్దరు కెప్టెన్లు టెస్టులకు మాజీ ప్లేయర్స్ గా మారిపోయారు. మే 7 వరకు టెస్టు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ ఆ రోజు సాయంత్రానికి ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు. 5 రోజుల తర్వాత ఈ ఫార్మాట్లో భారత్ కు అత్యంత విజయవంతమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికాడు. మరి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా భారత్ చివరిసారిగా ఎప్పుడు టెస్టు ఆడిందో తెలుసా.
(HT_PRINT)(2 / 5)
గత పదేళ్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భారత టెస్టు జట్టుకు వెన్నెముకగా నిలిచారు. ఈ ఇద్దరు స్టార్లు టీమిండియాను ముందుండి నడిపించారు. లార్డ్స్, అడిలైడ్, కేప్‌టౌన్, చిదంబరం స్టేడియం ఇలా ప్రపంచంలోని అన్ని ప్రధాన క్రికెట్ గ్రౌండ్లలోనూ ఈ జోడీ ఎన్నో క్లిష్టమైన మ్యాచ్ లలో భారత్ ను కాపాడింది. జూన్ 20 నుంచి జరిగే భారత టెస్టులో టీమిండియా 18, 45 అనే రెండు జెర్సీలను కోల్పోతుంది.
(PTI)(3 / 5)
భారత్ చివరిసారిగా 2022లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా ఆడింది. ఆ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాలో ఆడుతున్న సమయంలో విరాట్ కోహ్లీ గాయం కారణంగా ఆ టెస్టులో ఆడలేకపోగా, తొడ కండరాల గాయం కారణంగా రోహిత్ శర్మ ఆ సిరీస్ కు దూరమయ్యాడు. ఆ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు.
(PTI)(4 / 5)
జోహన్నెస్ బర్గ్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా భారత్ గెలవలేకపోయింది. ఈ మ్యాచ్ లో ప్రొటియాస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించారు. దక్షిణాఫ్రికా 2-1 తేడాతో సిరీస్ ను గెలుచుకుంది. విరాట్ కోహ్లి కెరీర్ లో కెప్టెన్ గా ఇదే చివరి టెస్టు సిరీస్. ఆ ఏడాది చివర్లో అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్ గా వైదొలిగాడు.
(Surjeet Yadav)(5 / 5)
కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి మొత్తం 190 టెస్టులు ఆడారు. 13531 పరుగులు, 44 సెంచరీలు చేశారు. ఇప్పుడీ ఇద్దరూ ఒకేసారి టెస్టు ఫార్మాట్ కు గుడ్ బై చెప్పడంతో వాళ్ల స్థానాలను ఎవరు భర్తీ చేస్తారన్న ఆసక్తి నెలకొంది. ఇది కచ్చితంగా ఇంగ్లండ్ లో టీమిండియాను పరీక్షించేదే.
(PTI)ఇతర గ్యాలరీలు