Blue mind theory: పర్వతాలు, సముద్రాలు.. ప్రశాంతత కోసం ఎక్కడికి వెళితే బెటర్? బ్లూ మైండ్ థియరీ ఏం చెబుతుందంటే..-know what is blue mind theory hills or beach which best place to visit ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Blue Mind Theory: పర్వతాలు, సముద్రాలు.. ప్రశాంతత కోసం ఎక్కడికి వెళితే బెటర్? బ్లూ మైండ్ థియరీ ఏం చెబుతుందంటే..

Blue mind theory: పర్వతాలు, సముద్రాలు.. ప్రశాంతత కోసం ఎక్కడికి వెళితే బెటర్? బ్లూ మైండ్ థియరీ ఏం చెబుతుందంటే..

Jun 26, 2024, 09:01 AM IST Koutik Pranaya Sree
Jun 26, 2024, 09:01 AM , IST

Blue mind theory: ఒత్తిడి నుంచి విముక్తి కోసం, మానసిక ప్రశాంతత కోసం కొత్త ప్రదేశాలకు ట్రిప్ వెళ్తాం. అయితే పర్వత ప్రాంతాలు, సముద్ర ప్రాంతాలు.. ఈ రెండింట్లో మన మనసుకు ప్రశాంతత ఇచ్చేవి ఏంటో తెలుసా? ఒక వైరల్ సిద్ధాంతం చెబుతున్న విషయాలు తెల్సుకోండి.

కొంత మంది హిల్ స్టేషన్ అంటే పర్వత ప్రాంతాల్ని ఇష్టపడితే.. మరికొంతమంది బీచ్ లేదా సముద్ర ప్రాంతాల్ని సందర్శించడానికి ఇష్టపడతారు. మరి ఈ రెండింట్లో ఏది సందర్శించడం ఉత్తమమో తెల్సా? వేటివల్ల మనసుకు ఎక్కువ ప్రశాంతత దొరుకుతుందో తెల్సా?

(1 / 7)

ఈ రెండింట్లో మానసిక ప్రశాంతత కోసం ఏది సందర్శిస్తే మంచిదో తెలిపే బ్లూ మైండ్ థియరీ ఒకటి ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ థియరీ ఏం చెబుతుందో చూడండి.

(2 / 7)

బ్లూ మైండ్ థియరీ అంటే ఏమిటి? 2015 లో శాస్త్రవేత్త వాలెస్ జె. నికోలస్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అతను మనస్సుకు ఏ పరిస్థితులు ఉత్తమమో పరిశీలించాడు.  ఏ ప్రాంతాల్లో తక్కువ ఒత్తిడిని అనుభవిస్తారో కూడా అతను పరీక్ష ద్వారా చూపించాడు. ఇదే "బ్లూ మైండ్ థియరీ".  

(3 / 7)

ఈ సిద్ధాంతం ఏమి చెబుతోంది? మనం సముద్ర తీరంలో గడిపినా, లేదా నీటిలో గడిపినా, నీటి మీద ప్రయాణం చేసినా.. అది శరీరం మీద సానుకూల ప్రభావం చూపుతుంది. మన మానసిక స్థితిని మెరుగుపర్చుకోడానికి నీటితో ఎలా గడపాలో బ్లూ మైండ్ థియరీ చెబుతుంది. నీలం లేదా బ్లూ రంగు నీటిని సూచిస్తుంది. నీటివల్ల వచ్చే ప్రశాంతతను తెలియజేయడానికి బ్లూ మైండ్ అనే పదం వాడతారు.  

(4 / 7)

నీటిని చూడటం, అలల నుంచి వచ్చే శబ్దం వినడం.. ఈ రెండూ మెదడు మీద చాలా ప్రభావం చూపుతాయి. ఇవి మనసుకు ప్రశాంతతనిస్తాయి. మెదడును శాంతపరుస్తాయి. దీన్నే బ్లూ మైండ్ థియరీ అంటారు. అందుకే సముద్ర తీరంలో గడిపినప్పుడు, సముద్ర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మనసు బాగుంటుందని చాలా మంది చెబుతారు.  

(5 / 7)

కానీ కొంతమందికి కొండల పైకి ఎక్కితేనే ఎక్కువ ఆనందం కలగొచ్చు. అది వ్యక్తి మనస్తత్వాన్ని, ఇష్టాన్ని బట్టి మారొచ్చు. కానీ మొత్తం మీద.. నీటి రంగు, నీటి శబ్దం మన మనస్సుపై మంచి ప్రభావాన్ని చూపుతాయి.  

(6 / 7)

ఇలాంటి భావన సముద్రం దగ్గరే కాదు… నదులు, సరస్సులు, స్విమ్మింగ్ పూల్స్ దగ్గర కూడా ఉంటుందట. ఈ కారణాల వల్లే బ్లూ మైండ్ థియరీ పుట్టిందని పలువురు మనస్తత్వవేత్తలు అభిప్రాయపడుతున్నారు.  

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు