Dinner Diet । రాత్రి భోజనంలో ఏం తినాలి, దేనిని నివారించాలి? ఆయుర్వేద సలహా ఇదిగో!
- Dinner Diet: ఆరోగ్యకరమైన ఆహారం మీ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఫిట్‌గా ఉండాలంటే ఆయుర్వేదం ప్రకారం మీ రాత్రి విందు ఇలా ఉండాలి.
- Dinner Diet: ఆరోగ్యకరమైన ఆహారం మీ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఫిట్‌గా ఉండాలంటే ఆయుర్వేదం ప్రకారం మీ రాత్రి విందు ఇలా ఉండాలి.
(1 / 8)
ఆయుర్వేదం ప్రకారం, మీరు రాత్రిపూట ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, వేటిని తీసుకోకూడదు ఇక్కడ తెలుసుకోండి.
(2 / 8)
ఆయుర్వేదం రాత్రి భోజనంలో మితంగా కార్బోహైడ్రేట్లు కలిగిన భోజనం తీసుకోవాలి. అది సులభంగా జీర్ణమయ్యేది అయి ఉండాలి. అతిగా తినాకూడదు. రాత్రిపూట ఎక్కువగా తినడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది.
(3 / 8)
ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట పెరుగు తినడం సరికాదు. ఇది శరీరంలో కఫ దోషాన్ని పెంచుతుంది. కావాలంటే మజ్జిగ తీసుకోవచ్చు.
(4 / 8)
బరువు తగ్గడానికి, మితంగా తినడం అవసరం. ఆరోగ్యంగా ఉండేందుకు సరైన మోతాదులో ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే రాత్రిపూట ఎక్కువగా తింటే ఉదయానికి అజీర్తి వస్తుంది.
(5 / 8)
రాత్రి భోజనంలో ప్రొటీన్లు తీసుకోవచ్చు. ఆహారంలో పప్పు, ఆకు కూరలు, కరివేపాకు ఉండాలి. ఇది జీర్ణక్రియకు అద్భుతమైనది.
(6 / 8)
మీకు రాత్రిపూట పాలు తాగే అలవాటు ఉంటే కొవ్వు తక్కువగా ఉండే పాలను తాగండి. అయితే పాలు చల్లగా కాకుండా, గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి.
(7 / 8)
సుగంధ ద్రవ్యాలు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అందువల్ల, మీ సాయంత్రం భోజనంలో వివిధ రకాల మసాలా దినుసులు చేర్చండి. ఇది శరీరంలో వేడిని పెంచుతుంది , మీ ఆకలిని అణచివేయడం ద్వారా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది.
ఇతర గ్యాలరీలు