Flight Journey Tips : విమాన ప్రయాణం చేయబోతున్నారా.. అయితే ఈ 7 ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి
- Flight Journey Tips : విమాన ప్రయాణం అంటే చాలా మందికి ఇష్టం. కానీ భయపడుతుంటారు. అయితే సురక్షితమైన ప్రయాణం కోసం కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ ప్రయాణం మరింత సౌకర్యంగా, సురక్షితంగా ఉంటుంది. అవేంటో ఓసారి చూద్దాం.
- Flight Journey Tips : విమాన ప్రయాణం అంటే చాలా మందికి ఇష్టం. కానీ భయపడుతుంటారు. అయితే సురక్షితమైన ప్రయాణం కోసం కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ ప్రయాణం మరింత సౌకర్యంగా, సురక్షితంగా ఉంటుంది. అవేంటో ఓసారి చూద్దాం.
(1 / 7)
ప్రయాణానికి ముందు లగేజీని సిద్ధం చేసుకోవాలి. విమానంలో తీసుకెళ్లే వస్తువుల జాబితాను ముందుగా చూసుకోవాలి. ముఖ్యమైన పత్రాలు, ఔషధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు హ్యాండ్ బ్యాగేజ్‌లో ఉంచాలి. విలువైన వస్తువులు, నగలు, పాస్‌పోర్టు కాపీలను చెక్ ఇన్ బ్యాగేజ్‌లో పెట్టవద్దు. మీ లగేజీ బరువు నిబంధనలను అనుసరించాలి. అధిక బరువుకు అదనపు ఛార్జీలు ఉంటాయి.
(istockphoto)(2 / 7)
విమానం బయలుదేరే సమయానికి కనీసం 2 గంటల ముందు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడం మంచిది. చెక్ ఇన్ ప్రక్రియ, భద్రతా తనిఖీలు చేయించుకోవడానికి సరిపడా సమయం ఉండేలా చూసుకోవాలి. తొందరపడితే పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది.
(istockphoto)(3 / 7)
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరమైన ఔషధాలను తీసుకువెళ్లాలి. విమాన ప్రయాణంలో అనారోగ్యం రాకుండా ఉండేందుకు తేలికైన ఆహారాన్ని తీసుకోవడం మంచింది. తగినంత నీరు తాగాలి.
(istockphoto)(4 / 7)
భద్రతా తనిఖీల సమయంలో అధికారుల సూచనలను పాటించాలి. విమానంలో తీసుకెళ్లడానికి అనుమతించని వస్తువులను తీసుకెళ్లవద్దు. లేకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
(istockphoto)(5 / 7)
విమానంలో సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం మంచిది. వినోదం కోసం పుస్తకాలు, మ్యూజిక్, గేమ్స్ వంటి వాటితో మీ ప్రయాణాన్ని ఆనందంగా గడపచ్చు.
(istockphoto)(6 / 7)
అధిక రక్తపోటు ఉన్నవారు తమ డాక్టర్ సలహా మేరకే ప్రయాణించాలి. గర్భిణీ స్త్రీలు ప్రయాణించే ముందు తమ డాక్టర్ సలహా తీసుకోవాలి. అవసరమైన అన్నీ అందుబాటులో ఉంచుకోవాలి.
(istockphoto)ఇతర గ్యాలరీలు