సంక్రాంతిరోజు పాలు పొంగి ఏ దిశలో కింద పడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకోండి-know the results of spilling milk in which direction while spilling milk at home ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  సంక్రాంతిరోజు పాలు పొంగి ఏ దిశలో కింద పడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకోండి

సంక్రాంతిరోజు పాలు పొంగి ఏ దిశలో కింద పడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకోండి

Jan 13, 2025, 09:00 AM IST Haritha Chappa
Jan 13, 2025, 09:00 AM , IST

సంక్రాంతికి పాలు పొంగించే సాంప్రదాయం ఉంది. అలాగే ఇళ్లల్లో కూడా పాలు పొంగుతూ ఉంటాయి. అలా పాలు పొంగినప్పుడు ఆ పాలు ఏ దిశలో పాలు కిందపడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకోండి. 

సంక్రాంతి పండుగ మొదటి రోజున కొత్త బియ్యం పాయసం వండుతారు . కొత్త కుండకు పసుపు దారాన్ని కట్టి  , కుండ చుట్టూ పూలదండను కట్టి, విభూతి పూసి పసుపు, కుంకుమలతో అలంకరించి ఆ తర్వాత నీటితో నింపుతారు.

(1 / 7)

వ్యవసాయ భూమిని ఇచ్చిన ఇంద్రుడు, సూర్యభగవానుడిని సంక్రాంతికి పూజిస్తారు.  వ్యవసాయానికి సహాయపడిన పశువులకు కృతజ్ఞతలు తెలుపుతారు.

(2 / 7)

పాయసం వండేముందుకు పాలను మరిగిస్తారు. ఆ పాలు పొంగే కింద పడే దిశను బట్టి కొన్ని ప్రయోజనాలు కలుగుతాయని చెబుతారు.దాన్ని బట్టి సంవత్సరం మొత్తం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు అని మన పూర్వీకులు అంటారు.

(3 / 7)

తూర్పు దిక్కు: పాలు గిన్నె నుంచి తూర్పూ దిక్కువైపు పొంగి కిందపడుతుంటే ఆ ఏడాది కొత్త ఇల్లు, భూమి కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు. 

(4 / 7)

పడమటి దిక్కు: పాలు కుండ నుంచి పడమటి దిశలో పొంగి ప్రవహిస్తే ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వివాహ వయసులో ఉన్న పిల్లలు ఇంట్లో ఉంటే వారికి మంచి సంబంధాలు దొరుకుతాయి.

(5 / 7)

ఉత్తరదిశ:  గిన్నె నుంచి పాలు ఉత్తర దిశ వైపు పొంగితే ఇంట్లో సంపద, ఐశ్వర్యం, ధన ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. పని ప్రదేశాల్లో పదోన్నతి, జీతాలు పెరిగే పరిస్థితులు కూడా ఉంటాయని చెబుతారు. అంతే కాదు ఇంట్లో నిరుద్యోగులుగా ఉన్న పిల్లలకు త్వరలోనే ఉద్యోగాలు లభిస్తాయని నమ్ముతారు. 

(6 / 7)

దక్షిణ దిక్కు: కుండ నుంచి పాలు దక్షిణ దిక్కువైపు ప్రవహిస్తే ఆ సంవత్సరం మీరు ఎక్కువ వైద్య ఖర్చులు భరించాల్సి వస్తుందని చెబుతారు. చాలా డిప్రెషన్ కు గురవుతారు. అవివాహితులకు వివాహంలో న్యాయపరమైన జాప్యం జరుగుతుందని చెబుతారు. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు