Parenting tips: పిల్లలు మీ మాట వినట్లేదా? కారణాలివే అయ్యుండొచ్చు..
Parenting tips: వాళ్ల అవసరాలు తీరకపోవడం దగ్గర నుంచి తల్లిదండ్రులు తమకు దూరమైపోతున్నారనే కారణం వరకు.. పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడానికి కారణాలున్నాయి. అవేంటో చూడండి.
(1 / 6)
పిల్లలు తల్లిదండ్రుల మాట వినడానికి నిరాకరించినప్పుడు, తల్లిదండ్రుల మీద చాలా ప్రభావం పడుతుంది. అప్పుడు వాళ్లమీద అరవడం, కోపం చూపించడం, ఏదైనా శిక్ష వేయడం కన్నా దానికి సంబంధించిన కారణం కనుక్కోవాలి. సైకాలజిస్ట్ జాజ్మిన్ మెక్ కాయ్ పిల్లల ఈ ప్రవర్తనను అర్థం చేసుకుని ఆరోగ్యకరమైన రీతిలో ఎలా పరిష్కరించవచ్చో వివరించారు.
(Gettyimages)(2 / 6)
వాళ్ల ప్రాధాన్యతలు వేరు: పిల్లలకు సంబంధించిన విషయాలే తల్లిదండ్రుల దినచర్యలో ముఖ్య భాగం. కానీ వాళ్లకలా కాదు. వేరే విషయాలు కొత్తగా నేర్చుకుంటారు. కొత్త వాతావరణానికి అలవాటు పడతారు. వాళ్లను ఆకర్షించే విషయాలు వేరేవి ఉండొచ్చు. వాళ్ల ఇష్టాలను అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా తల్లిదండ్రులు మసులుకోవడం ముఖ్యం.
(Getty Images/iStockphoto)(3 / 6)
మాట నిలబెట్టుకోవడం: తల్లిదండ్రులు మాట చెప్పినట్లు కాకుండా చేతల్లో వేరేలా చేస్తున్నప్పుడు. వాళ్ల మాటలకు చేతలకు సంబంధం లేనప్పుడు పిల్లలు వాటిని గమనిస్తారు. దాంతో తల్లిదండ్రులు కేవలం మాటలు మాత్రమే చెప్తారని నమ్మి వాళ్ల మాటలు వినడం మానేస్తారు.
(Unsplash)(4 / 6)
అడిగిందళ్లా ఇవ్వడం: తల్లిదండ్రులుగా పిల్లలు అడిగిన ప్రతిదీ ఇచ్చేలా చూస్తారు. కానీ దానివల్ల వాళ్లకు వాళ్లేం అడిగినా దొరుకుతుందనే భావన వస్తుంది. అందుకే వాళ్ల డిమాండ్లకు ప్రతిసారీ లొంగిపోకూడదు. అవసరమైనవేవో కాదో వివరంగా చెప్పాలి. దీనివల్ల మీమాట అర్థం చేసుకుంటారు.
(Unsplash)(5 / 6)
తీరని అవసరాలు: ఆకలి, నిద్ర, ఒంటరితనం, విసుగు లేదా తీవ్రమైన భావోద్వేగాలు వంటివి తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని తగ్గించేలా చేస్తాయి. వాళ్ల మాట వినకుండా చేస్తాయి.
(Unsplash)ఇతర గ్యాలరీలు