Countries Without River : ఈ దేశాల్లో ఒక్క నది కూడా ప్రవహించదు.. కానీ నీటి కొరత మాత్రం లేదు
- Countries Without River : ప్రపంచవ్యాప్తంగా చాలా నాగరికతలు ఏదో ఒక నది ఒడ్డున మెుదలు అయ్యాయి. అయితే ఒక్క నది కూడా లేని దేశాలు చాలానే ఉన్నాయి. అక్కడ నీటి సమస్యను ఎలా తీరుస్తారో చూద్దాం..
- Countries Without River : ప్రపంచవ్యాప్తంగా చాలా నాగరికతలు ఏదో ఒక నది ఒడ్డున మెుదలు అయ్యాయి. అయితే ఒక్క నది కూడా లేని దేశాలు చాలానే ఉన్నాయి. అక్కడ నీటి సమస్యను ఎలా తీరుస్తారో చూద్దాం..
(1 / 8)
సౌదీ అరేబియా : ప్రపంచంలో ఒక్క నది కూడా లేని అతి పెద్ద దేశాలలో సౌదీ అరేబియా ఒకటి. అయితే ఇక్కడి ప్రభుత్వం నీటి సరఫరా కొనసాగేలా నీటి నిర్వహణ వ్యూహాన్ని రూపొందించింది. ఇక్కడ సముద్రంలోని ఉప్పునీటిని తాగునీరుగా తయారు చేస్తారు. ఈ దేశం నీటిని పునర్వినియోగం చేయడానికి, భూగర్భ జలాలను సంరక్షించడానికి చాలా ఖర్చు చేస్తుంది.
(2 / 8)
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) : యూఏఈలో ఒక్క నది కూడా లేదు. ఇక్కడి నీటి అవసరాలను డీశాలినేషన్ ద్వారా తీరుస్తారు.శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలలో ఉపయోగిస్తారు. (డీశాలినేషన్ అనగా.. సముద్రపు నీరు వంటి ఉప్పునీటి నుండి ఖనిజాలు, లవణాలను తొలగిస్తారు. మంచినీటిని ఉత్పత్తి చేస్తారు. డీశాలినేషన్ ప్లాంట్ల ద్వారా వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు కూడా మంచినీటిని ఉత్పత్తి చేసుకుంటారు.)
(3 / 8)
ఖతార్ : ఖతార్‌లో ఒక్క నది కూడా లేదు. దాదాపు 99 శాతం తాగునీరు డీశాలినేషన్ ప్లాంట్ల ద్వారా సరఫరా అవుతుంది. ఇక్కడ తలసరి నీటి వినియోగం చాలా ఎక్కువగా ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
(4 / 8)
కువైట్ : పొరుగు దేశాల మాదిరిగానే కువైట్ కూడా డీశాలినేషన్ ప్లాంట్ల ద్వారా నీటిని సమకూర్చుకుంటుంది. శుద్ధి చేసిన నీటిని సాగు, పరిశ్రమలకు వినియోగిస్తుంది.
(5 / 8)
బహ్రయిన్ : ఈ దేశం కూడా పర్షియన్ గల్ఫ్‌లో ఉంది. ఇక్కడ నదులు లేవు. కానీ జలపాతాలు, భూగర్భ జల వనరులు ఉన్నాయి. అయితే ఇవి దేశ అవసరాలను తీర్చలేవు. అటువంటి పరిస్థితిలో డీశాలినేషన్ ప్లాంట్లను ఉపయోగిస్తారు.
(6 / 8)
మాల్దీవులు : మాల్దీవులకు అన్ని వైపులా సముద్రం చుట్టుముట్టింది. అయితే ఇక్కడ నది లేదు. ఇక్కడ నీటి కొరతను డీశాలినేషన్ ప్లాంట్లు, వర్షపునీటి సంరక్షణ, బాటిల్ వాటర్ దిగుమతి ద్వారా తీరుస్తారు.
(7 / 8)
ఒమన్ : ఒమన్‌లో శాశ్వత నదులు లేవు కానీ వర్షాకాలంలో చాలా చోట్ల నీరు ప్రవహించడం ప్రారంభమవుతుంది. తద్వారా భూగర్భ జలాలు నిండుతాయి. మిగిలిన నీటి కొరతను కూడా డీశాలినేషన్ ప్లాంట్ తీరుస్తుంది దేశం.
ఇతర గ్యాలరీలు