Lucky Things Under Pillow: దిండు కింద వీటిని పెట్టుకున్నారంటే అదృష్టంతో పాటు ఆరోగ్యం!
- Lucky Things Under Pillow: పడుకునే ముందు దిండు కింద కొన్ని వస్తువులను పెట్టుకోవడం వల్ల అదృష్టంతో పాటు ఆరోగ్యం కూడా సిద్దిస్తుందని, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం సాధిస్తారని వాస్తు, జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్నాయి. అవేంటో తెలుసుకోండి.
- Lucky Things Under Pillow: పడుకునే ముందు దిండు కింద కొన్ని వస్తువులను పెట్టుకోవడం వల్ల అదృష్టంతో పాటు ఆరోగ్యం కూడా సిద్దిస్తుందని, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం సాధిస్తారని వాస్తు, జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్నాయి. అవేంటో తెలుసుకోండి.
(1 / 8)
రాత్రి పడుకునేటప్పుడు దిండు కింద కొన్ని వస్తువులను పెట్టుకోవడం వల్ల జీవితంలో సానుకూల శక్తులతో పాటు అదృష్టం వరిస్తుందని, ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని వాస్తు, జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్నాయి.కనీసం 21 రోజుల పాటు వీటిని పెట్టుకున్నారంటే జీవితంలో ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్యం వంటి అన్ని విషయాల్లో అభివృద్ధిని చూడొచ్చని నమ్ముతారు.
(pixabay)(2 / 8)
నాణెం: రాత్రంతా దిడ్డు కింద పెట్టుకొని ఉదయాన్నే పేద వారికి లేదా భిక్షగాళ్లకు దానం చేయడం వల్ల అదృష్టం, ఆనందం సొంతమవుతాయని చెబుతారు.
(3 / 8)
కత్తి: దిండు కింద కత్తి పెట్టుకుని పడుకోవడం వల్ల పీడకలలు రావట. మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ప్రభావం కూడా తగ్గుతుందని నమ్ముతారు.
(pixabay)(4 / 8)
సువాసన భరితమైన పూలు:సువాసన వెదజల్లే పూలను దిండు కింద పెట్టుకొని పడుకోవడం వల్ల భార్యభర్తల మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతాయి. గొడవలకు తావుండదని నమ్మిక
(pixabay)(5 / 8)
బిర్యానీ ఆకులు:బిర్యాని ఆకులను దిండు కింద పెట్టుకుని పడుకోవడం వల్ల శ్రేయస్సు, విజయం, రక్షణను ఆకర్షిస్తుందని నమ్ముతారు. ఆకుల మీద మీ కోరికను రాసి పెట్టుకుంటే అది త్వరగా నెరవేరే అవకాశాలు కూడా ఉన్నాయట.
(pixabay)(6 / 8)
దాల్చిన చెక్క: దాల్చిన చెక్క సమృద్ధి, ప్రేమ, ఆర్థిక శ్రేయస్సును సూచిస్తుంది.దీన్ని తల కింద పెట్టుకుని పడుకోవడం వల్ల ఇవన్నీ దక్కుతాయని చెబుతారు.
(7 / 8)
ఇలాచీ: దిండు కింద ఇలాచీ పెట్టుకుని పడుకోవడం వల్ల మానసిక, ఆర్థిక శ్రేయస్సు కలుగుతాయని, ప్రశాంతమైన నిద్రను పొందవచ్చని నమ్ముతారు.
(pixabay)ఇతర గ్యాలరీలు