తొలి ఏకాదశి విశిష్టత, తేదీ, పూజా విధానం తెలుసుకోండి
- హిందూమతంలో శయన ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. దీనినే తొలి ఏకాదశి అని కూడా అంటారు. నిజానికి ఈ రోజు నుండి విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల శ్రీవిష్ణువు అలాగే అమ్మవారి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి. శయని ఏకాదశి తిథి, ప్రాముఖ్యత, పూజా విధానం తెలుసుకుందాం.

(1 / 6)
ఏకాదశి వ్రతం ఆచరిస్తే పాపముల నుంచి విముక్తి లభిస్తుంది. మోక్షం లభిస్తుంది. ఈ ఏకాదశి నాడు రాత్రి వెలిగించి విష్ణువును పూజించాలి. అలాగే మహా లక్షికి దీపం వెలిగించాలి. రాత్రంతా రెండు దీపాలు వెలిగేలా చూసుకోండి.
(2 / 6)
దేవ శయన ఏకాదశికి విశేష ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ మాసం శుక్ల పక్ష ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళతాడు. తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేసి ద్వాదశి రోజు ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అల్పాహారం తీసుకుంటారు. స్వామి వారు ఈరోజు యోగ నిద్రకు ఉపక్రమించి తిరిగి నాలుగు నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుంచి మేల్కొంటారు.
(3 / 6)
దేవశయని ఏకాదశి పూజ సమయాలు: దేవశయని ఏకాదశి తిథి జూన్ 29 తెల్లవారుజామున 3.18 గంటలకు ప్రారంభమై జూన్ 30 మధ్యాహ్నం 2.42 గంటలకు కొనసాగుతుంది.
(4 / 6)
శయన ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజు తులసి నైవేద్యం లేకుండా విష్ణువు యొక్క ఆరాధన అసంపూర్ణంగా మారుతుంది.
(5 / 6)
దేవశయనీ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయాలి. శుభ్రమైన బట్టలు ధరించండి. ఆ తరువాత విష్ణుమూర్తికి దీపం వెలిగించండి. పుష్పాలు, చందనం, తులసితో కూడిన నైవేద్యాలు సమర్పించండి.
ఇతర గ్యాలరీలు