Infertility reasons: తల్లి కావాలనే కోరిక నెరవేరడం లేదా? ఈ 7 కారణాలేంటో తెల్సుకోండి..-know major seven types of infertility reasons in men and women ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Infertility Reasons: తల్లి కావాలనే కోరిక నెరవేరడం లేదా? ఈ 7 కారణాలేంటో తెల్సుకోండి..

Infertility reasons: తల్లి కావాలనే కోరిక నెరవేరడం లేదా? ఈ 7 కారణాలేంటో తెల్సుకోండి..

Jul 03, 2024, 02:11 PM IST Koutik Pranaya Sree
Jul 03, 2024, 02:11 PM , IST

Infertility reasons: మీరు చాలా కాలంగా గర్భం ధరించడానికి ప్రయత్నిస్తూ, పదేపదే విఫలమవుతుంటే, మీరు ఈ కారణాల గురించి తెలుసుకోవాలి.

చాలా కాలంగా బిడ్డను కనాలని ఆలోచిస్తూ, విఫలమవుతూనే ఉంటే, మీరు గర్భం ధరించడానికి ఆటంకం కలిగించే కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలి.  

(1 / 8)

గర్భాశయ పరిమాణం: స్త్రీ గర్భాశయ పరిమాణం సాధారణంగా లేకపోతే, గర్భం ధరించడంలో సమస్యలు ఉండవచ్చు. గర్భాశయం ఆకారం సరిగ్గా లేకపోతే,  అండం ఫలదీకరణకు ఆటంకం రావచ్చు, తద్వారా గర్భధారణకు ఆటంకం కలుగుతుంది.

(2 / 8)

గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు: గర్భం దాల్చకపోవడానికి ఫైబ్రాయిడ్లు ఒక ప్రధాన కారణం. గర్భాశయంలోని ఫైబ్రాయిడ్లు అండం ఫలదీకరణను ప్రభావితం చేస్తాయి.

(3 / 8)

పురుషుల ఆరోగ్యం: వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం, అసాధారణ వీర్యకణాల కదలిక లేదా ఆకారం కారణంగా పురుషుల్లో సంతానలేమికి కారణాలు కావచ్చు. అంతేకాకుండా మధుమేహం, మితిమీరిన మద్యపానం, ధూమపానం వంటి పరిస్థితులు పురుషుల్లో సంతానలేమి సమస్యను పెంచుతాయి.

(4 / 8)

ఆందోళన: ఒత్తిడి, ఆందోళన మహిళల్లో సంతానోత్పత్తి రేటు తగ్గడానికి దారితీస్తాయని నివేదికలు చెబుతున్నాయి. ఒత్తిడి మహిళల కంటే పురుషులను ఎక్కువగా ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోండి. 

(5 / 8)

వయస్సు: సంతానోత్పత్తి రేటు వయస్సును బట్టి మారుతుంది. మహిళల వయసు పెరిగే కొద్దీ అండం నాణ్యత తగ్గుతుంది .37 ఏళ్ల వయసు తర్వాత మహిళలకు అండం విడుదల చేసే రేటు తగ్గిపోతుంది. అలాంటి పరిస్థితిలో గర్భం పొందడం కష్టమవుతుంది. పురుషుల్లో 40 ఏళ్ల తర్వాత సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడం ప్రారంభమవుతుంది.

(6 / 8)

హార్మోన్ల అసమతుల్యత: గర్భం ధరించడానికి కొన్ని హార్మోన్లు సరైన సామర్థ్యంలో ఉండటం అవసరం. ఆ హార్మోన్ల అసమతుల్యత వల్ల గర్భం దాల్చే అవకాశాలు తగ్గుతాయి.

(7 / 8)

అనారోగ్యకరమైన జీవనశైలి: సరైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు లేని కారణంగా సంతానోత్పత్తి మీద ప్రభావం పడుతుంది. అందుకే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చాలా ముఖ్యం.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు