(1 / 6)
హార్దిక్ పాండ్యా, నటాషా లు జూలై 18న అధికారికంగా విడాకులు తీసుకున్నారు.. అయితే హార్దిక్-నటాషా కంటే ముందు క్రికెట్ రంగంలోని ప్రముఖ క్రికెటర్లు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న వారెవరో చూసేయండి.
(2 / 6)
సచిన్ టెండూల్కర్ కు అత్యంత సన్నిహితుడైన మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ 1998లో తన చిన్ననాటి స్నేహితురాలు నోయెలా లూయిస్ ను వివాహం చేసుకున్నాడు.అయితే వ్యక్తిగత కారణాలతో ఆమెతో విడాకులు తీసుకున్నాడు.
(3 / 6)
దినేష్ కార్తీక్ తన చిన్ననాటి స్నేహితురాలు నికితా వంజారాను 2007లో 21 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్నాడు. ఐదేళ్ల తర్వాత వారి వైవాహిక బంధం ముగిసింది. వేరొకరితో సంబంధం పెట్టుకుని ద్రోహం చేసిన కారణంగా భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత డీకే 2015లో స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ ను వివాహం చేసుకున్నాడు.
(4 / 6)
శిఖర్ ధావన్ కూడా విడాకులు తీసుకున్నాడు.ధావన్ తనకంటే పదేళ్లు పెద్దదైన ఆయేషా ముఖర్జీని 2012లో పెళ్లి చేసుకున్నాడు.అయితే 11 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2023లో ఈ జంట విడిపోయారు.
(5 / 6)
భారత పేసర్ మహ్మద్ షమీ 2014లో హసీన్ జాన్ ను వివాహం చేసుకున్నాడు. కానీ నాలుగేళ్ల తర్వాత అతనికి విడాకులు ఇచ్చారు. షమీపై హసీన్ అక్రమ సంబంధం, గృహహింస ఆరోపణలు చేసింది. ఈ కేసు ఇంకా కోర్టులోనే ఉంది.
(6 / 6)
మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ ఇద్దరిని వివాహం చేసుకుని ఇద్దరికీ విడాకులు ఇచ్చాడు. 1996లో తన మొదటి భార్య నౌరీన్ కు విడాకులు ఇచ్చాడు.తరువాత బాలీవుడ్ నటి సంగీతా బిజ్లానీని వివాహం చేసుకున్నాడు .కొద్ది సంవత్సరాల్లోనే వాళ్లిద్దరు కూడా విడిపోయారు.
ఇతర గ్యాలరీలు