Hand Washing: వాటిని తాకే ముందు మీ చేతులు కడుక్కుంటున్నారా?
- Hand Washing: రోజంతా మన చేతులతో రకరకాల పనులు చేస్తుంటాం, ఎన్నో వస్తువులను తాకుతుంటాం కానీ చేతులు కడుక్కోవడం మరిచిపోతుంటాం. దీనివలన జరిగే నష్టం ఇక్కడ తెలుసుకోండి..
- Hand Washing: రోజంతా మన చేతులతో రకరకాల పనులు చేస్తుంటాం, ఎన్నో వస్తువులను తాకుతుంటాం కానీ చేతులు కడుక్కోవడం మరిచిపోతుంటాం. దీనివలన జరిగే నష్టం ఇక్కడ తెలుసుకోండి..
(1 / 6)
చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఏదైనా తినే ముందు చేతులు కడుక్కోకపోవడం వివిధ వ్యాధులకు కారణమవుతుంది. (Freepik)
(2 / 6)
మూత్ర విసర్జన, మల విసర్జన చేసిన తర్వాత తప్పకుండా చేతులు కడుక్కోవాలి, చేయక ముందు కూడా కడుక్కోవాలి. మూత్ర విసర్జన, మల విసర్జన చేసే ముందు కూడా చేతులు కడుక్కోవాలని చాలా మందికి తెలియదు. (Freepik)
(3 / 6)
మలమూత్ర విసర్జనకు ముందు చేతులు ఎందుకు కడుక్కోవాలంటే.. ప్రైవేట్ పార్ట్స్, మలద్వారం చాలా సున్నితమైన భాగాలు. మురికి చేతులతో వాటిని తాకితే వాటి ద్వారా క్రిములు శరీరంలోకి చేరుతాయి. ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. (Freepik)
(4 / 6)
అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని తాకిన తర్వాత ఎల్లప్పుడూ మీ చేతులను కడగాలి. ఇలా చేయడం చాలా మంది మర్చిపోతుంటారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. మీరు జలుబుతో బాధపడుతున్న రోగిని తాకినా, చేతులు కడుక్కోవాలి. (Freepik)
(5 / 6)
కళ్లు, నోరు , ముక్కు శరీరంలోని మూడు అత్యంత సున్నితమైన భాగాలు. అనవసరంగా మీ వేళ్లను కళ్లు ముక్కు, నోటి వద్ద పెట్టకూడదు. వాటిని తాకే ముందు చేతులు శుభ్రంగా ఉంచుకోండి. (Freepik)
(6 / 6)
మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చిన తర్వాత చేతులు కడుక్కోవాలి. కూరగాయల్లోని రసాయనాలు శరీరంలోకి చేరితే చాలా నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ మీ చేతులను బాగా కడగాలి.(Freepik)
ఇతర గ్యాలరీలు