Wet shoes: ఎండలు లేక తడిసిన షూలు ఒక పట్టాన ఆరట్లేదా? వర్షాకాలంలో ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
Wet shoes: వర్షాకాలంలో నీళ్లలో, వర్షంలో తడిసిన షూలను ఆరబెట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకపట్టాన ఆరిపోవు. దానికోసం ఈ చిట్కాలు తెల్సుకోండి.
(1 / 6)
వర్షాకాలంలో బట్టలు ఆరడమే కష్టంగా ఉంటుంది. ఇక వర్షంలో, నీళ్లలో షూ తడిస్తే వాటిని ఆరబెట్టడం మరింత కష్టం. ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని ఆరబెట్టడానికి కొన్ని మార్గాలు తెలియాల్సిందే. అవేంటో చూడండి.
(freepik)(2 / 6)
ఇంట్లో హెయిర్ డ్రైయర్ అందుబాటులో ఉండే దాన్ని వాడండి. ముందు నీళ్లు వడిచి పోయేంత వరకు షూను బయట తగిలేయండి. కాస్త నీల్లు వడిచిపోయాక హెయిర్ డ్రైయర్ వాడి షూ ఆరబెట్టండి. వేడి గాలికి తేమ ఆరిపోతుంది.
(freepik)(3 / 6)
హెయిర్ డ్రయర్ లేకపోతే.. న్యూస్ పేపర్ వాడొచ్చు. షూ లోపలి ఇన్ సోల్ ముందుగా బయటకు తీసేసి ఆరబెట్టాలి. న్యూస్ పేపర్‌ను ఉండలుగా చుట్టి షూ లోపల నిండా పెట్టేయాలి. చివరగా షూను న్యూస్ పేపర్ తో చుట్టేయాలి. ప్రతి రెండు గంటలకోసారి, లేదా పేపర్ తడి అవ్వగానే లోపల వేరే పేపర్లు పెడుతుండాలి. తర్వాత కాసేపు ఫ్యాన్ కింద ఆరబెడితే సరిపోతుంది.
(freepik)(4 / 6)
రోజూవారీ షూ ఎక్కువగా తడిచిపోతున్నాయి అనుకుంటే.. మార్కెట్లో ప్రత్యేకంగా షూలు ఆరబెట్టడానికి ఉండే షూ డ్రయర్ దొరుకుతోంది. దాన్ని వాడితే షూ తొందరగా ఆరిపోతాయి.
(freepik)(5 / 6)
కాటన్, కాన్వాస్, నైలాన్ తో చేసిన ఫ్యాబ్రిక్ షూలు ఆరబెట్డడానికి వాషింగ్ మెషీన్ డ్రైయర్ లో వేసేయొచ్చు. వాటి లేబుల్ ఒకసారి చదివి ఈ డ్రైయర్ వాడండి. లేదంటే వీటిని మరీ అత్యవసరం అనుకుంటే ఒక డబ్బాలో బియ్యం పోసి అందులో షూ వేసి మూత పెట్టండి. బియ్యం తేమను పీల్చుకుంటుంది. షూ తొందరగా ఆరిపోతాయి.
(freepik)ఇతర గ్యాలరీలు