Healthy seeds: ఈ గింజలను రాత్రంతా నానబెట్టి తింటే.. జీర్ణసమస్యలకు చెక్-know healthy seeds which should be consumed after soaking ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Healthy Seeds: ఈ గింజలను రాత్రంతా నానబెట్టి తింటే.. జీర్ణసమస్యలకు చెక్

Healthy seeds: ఈ గింజలను రాత్రంతా నానబెట్టి తింటే.. జీర్ణసమస్యలకు చెక్

Published Jun 27, 2024 10:10 AM IST Koutik Pranaya Sree
Published Jun 27, 2024 10:10 AM IST

Healthy seeds: గోంద్ కతీరా నుంచి సబ్జా గింజల వరకు.. పోషకాలను పెంచడానికి, జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి కొన్ని ఆహారాలు రాత్రంతా నానబెట్టి తినాలి. అవేంటో తెల్సుకోండి. 

గుండె ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం, రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ కోసం ఈ సూపర్ ఫుడ్స్ ను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినండి. పోషకాహార నిపుణురాలు పూజా బోహ్రా ఇన్ స్టాగ్రామ్ లో ఈ విషయాన్ని పంచుకున్నారు.  

(1 / 6)

(Shutterstock, Freepik)

రాజ్మాను రాత్రంతా నానబెట్టడం వల్ల వండే సమయం తగ్గడమే కాకుండా జీర్ణక్రియ కూడా సులభమవుతుంది.ఇందులో ప్రోటీన్, ఫైబర్, అనేక విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి, ఇవి గుండె ఆరోగ్యానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచడానికి దోహదం చేస్తాయి.  

(2 / 6)

(Freepik)

సబ్జా గింజలు: వీటిని రాత్రంతా నానబెట్టడం వల్ల అవి నీటిని బాగా పీల్చుకుంటాయి. సులభంగా జీర్ణం అవుతాయి. ఈ చిన్న విత్తనాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది, జీర్ణక్రియకు సహాయపడతాయి. బరువు నియంత్రణలో తోడ్పడతాయి. 

(3 / 6)

(Pinterest)

బంక: బంక లేదా గోంద్ కతీరా రాత్రిపూట నానబెట్టడం వల్ల రుచిగా ఉంటుంది. గరిష్ట ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. శరీరాన్ని చల్లబరిచే లక్షణం ఉన్న ఈ బంక జీర్ణక్రియను మెరుగుపరచడానికి, చర్మ ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది, ముఖ్యంగా వేసవిలో దీన్ని ఉపయోగించడం ఆరోగ్యదాయకం.

(4 / 6)

(Adobe Stock)

వాల్ నట్స్: వాల్ నట్స్ ను నానబెట్టడం వల్ల ఫైటిక్ యాసిడ్ పరిమాణం తగ్గుతుంది. తొందరగా జీర్ణం అవుతాయి కూడా. అలాగే శరీరానికి  పోషకాలు ఎక్కువగా అందుతాయి. వాల్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి,మెదడు ఆరోగ్యానికి తోడ్పడతాయి.  

(5 / 6)

ఇలా నానబెట్టిన సూపర్ ఫుడ్స్‌ను బ్రేక్ ఫాస్ట్ స్మూతీ, పెరుగు, లంచ్ లేదా ఈవెనింగ్ స్నాక్స్ లో చేర్చుకోండి.మీ శరీరానికి అదనపు పోషణ మరియు శక్తి లభిస్తుంది. 

(6 / 6)

ఇతర గ్యాలరీలు