
(1 / 10)
జనవరి 22 న అయోధ్యలో ప్రతిష్టించనున్న రామ్ లల్లా విగ్రహం నల్లరాతితో చేశారు. అద్భుతమైన శోభను కలిగి ఉంది. నిజంగా రాముడి బాల అవతారాన్ని చూసినట్టుగా అనిపిస్తుంది. గురువారం మంత్రోచ్ఛారణల మధ్య విగ్రహాన్ని ఆలయ గర్భగుడిలో ఉంచారు. అప్పుడు ఈ విగ్రహం కళ్ళు పసుపు గుడ్డతో కప్పబడి ఉన్నాయి. వాటిని ప్రాణ ప్రతిష్ట రోజు తొలగిస్తారు. 51 అంగుళాల ఎత్తున్న ఈ విగ్రహానికి సంబంధించి అనేక ఆసక్తికరమైన విషయాలు మీకోసం.
(2 / 10)
ఈ రామ్ లల్లా విగ్రహాన్ని కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. ఇది ఒకే రాయితో చేయబడింది, ఏకా శిలా విగ్రహం.

(3 / 10)
ఈ విగ్రహం బరువు దాదాపు 200 కిలోలు. విగ్రహం ఎత్తు 4.24 అడుగులు, వెడల్పు మూడు అడుగులు. ఈ విగ్రహం శ్రీరాముడిని 5 సంవత్సరాల పిల్లవాడిగా వర్ణిస్తుంది.

(4 / 10)
రామ్ లల్లా విగ్రహం మీద విష్ణువు పడి అవతారాలు కనిపిస్తాయి. ఈ 10 అవతారాలు – మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురాముడు, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి అవతారాలకి సంబంధించిన చిన్న చిన్న విగ్రహాలు ఇరువైపులా కనిపిస్తాయి.
(ANI)
(5 / 10)
విగ్రహానికి ఒకవైపు శ్రీ హనుమంతుడు, మరోవైపు గరుడుడు ఉన్నారు.

(6 / 10)
రామ్ లల్లా కిరీటం పక్కన సూర్య దేవుడు, శంఖం, స్వస్తిక, సుదర్శన చక్రం, జాపత్రి కనిపిస్తాయి. విగ్రహం కిరీటం వెనుక శ్రీరాముని వంశ దైవం అయిన సూర్య భగవానుడు కనిపిస్తాడు.
(PTI)
(7 / 10)
రామ్ లల్లా ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణం పట్టుకున్నట్టు ఉంటుంది.
(PTI)
(8 / 10)
నల్లరాతితో చేసిన రామ్ లల్లా విగ్రహం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. బాలరాముడి రూపం చూసి అందరూ తన్మయత్వంతో మునిగిపోతున్నారు. సాలగ్రామ రాతితో దీన్ని రూపొందించారు. వాటర్ ప్రూఫ్ విగ్రహం. నీరు, ఇతర పదార్థాలు తగిలిన ఎటువంటి హాని జరగదు.
(ANI)
(9 / 10)
రాముడు ఐదేళ్ల రూపంతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంటుంది.
(PTI)
(10 / 10)
దక్షిణ భారత శైలిలో 51 అంగుళాల పొడవైన రామ్ లల్లా విగ్రహం దూరం నుంచి భక్తులు చూసిన కనిపించేలా చేశారు.
(AFP)ఇతర గ్యాలరీలు