(1 / 5)
ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ బ్యాటర్ తాజాగా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఐపీఎల్ లో 5000 వేల రన్స్ పూర్తిచేసిన ఫాస్టెస్ట్ బ్యాటర్ గా నిలిచాడు. కేఎల్ 130 ఇన్నింగ్స్ ల్లో ఈ ఫీట్ సాధించాడు.
(AFP)(2 / 5)
ఇంతకుముందు ఐపీఎల్ 5000 రన్స్ ఫాస్టెస్ట్ బ్యాటర్ రికార్డు డేవిడ్ వార్నర్ పేరు మీద ఉండేది. అతను 135 ఇన్నింగ్స్ ల్లో ఈ మైలురాయి చేరుకున్నాడు. 2020లో ఈ రికార్డు సాధించాడు.
(x/mufaddal_vohra)(3 / 5)
ఐపీఎల్ లో బ్యాటర్ల కు సంబంధించిన రికార్డు ఏదైనా అందులో కచ్చితంగా కింగ్ కోహ్లి పేరు ఉండాల్సిందే. ఈ లీగ్ ఫాస్టెస్ట్ 5000 రన్స్ లిస్ట్ లో విరాట్ మూడో ప్లేస్ లో ఉన్నాడు. 157 ఇన్నింగ్స్ ల్లో అతను ఈ పరుగులు చేశాడు.
(PTI)(4 / 5)
ఆధునిక క్రికెట్ దిగ్గజాల్లో ఒకడైన ఏబీ డివిలియర్స్ కూడా ఐపీఎల్ లో అదరగొట్టాడు. అతను ఈ లీగ్ లో 5000 రన్స్ చేసేందుకు 161 ఇన్నింగ్స్ లు ఆడాడు.
(x/ImTanujSingh)ఇతర గ్యాలరీలు