KKR vs SRH IPL 2024 Final: ఫైనల్ ఫైట్‍లో టాస్ గెలిచిన హైదరాబాద్.. తుది జట్లు ఇలా
- KKR vs SRH IPL 2024 Final: ఐపీఎల్ 2024 ఫైనల్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచింది. ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు కెప్టెన్ ప్యాట్ కమిన్స్. ఈ ఫైనల్‍లో హైదరాబాద్, కోల్‍కతా నైట్‍రైడర్స్ తుదిజట్లు ఎలా ఉన్నాయంటే..
- KKR vs SRH IPL 2024 Final: ఐపీఎల్ 2024 ఫైనల్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచింది. ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు కెప్టెన్ ప్యాట్ కమిన్స్. ఈ ఫైనల్‍లో హైదరాబాద్, కోల్‍కతా నైట్‍రైడర్స్ తుదిజట్లు ఎలా ఉన్నాయంటే..
(1 / 5)
సన్‍రైజర్స్ హైదరాబాద్, కోల్‍కతా నైట్‍రైడర్స్ మధ్య ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ సమరం షురూ అయింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా నేడు (మే 26) ఈ టైటిల్ పోరు జరుగుతోంది.
(AP)(2 / 5)
ఈ ఫైనల్ ఫైట్‍లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు. గత మ్యాచ్‍తో పోలిస్తే ఫైనల్ కోసం తుది జట్టులో హైదరాబాద్ ఓ మార్పు చేసింది.
(AP)(3 / 5)
అబ్దుల్ సమద్ స్థానంలో షాబాజ్ అహ్మద్‍ను తీసుకుంది హైదరాబాద్. గత మ్యాచ్‍లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడిన షాబాజ్ ఇప్పుడు తుదిజట్టులోకి వచ్చేశాడు. సన్‍రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రమ్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నటరాజన్. ఇంపాక్ట్ ప్లేయర్‌గా మయాంక్ మార్కండేను తీసుకునే ఛాన్స్ ఉంది.
(AFP)(4 / 5)
ఫైనల్ పోరు కోసం తుదిజట్టులో కోల్‍కతా ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్ జట్టునే కొనసాగించింది. కోల్‍కతా నైట్‍రైడర్స్ తుదిజట్టు: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్‍దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి. ఇంపాక్ట్ ప్లేయర్‌గా నితీశ్ రాణాను తీసుకునే ఛాన్స్ ఉంది.
(AFP)ఇతర గ్యాలరీలు