
(1 / 5)
మకర సంక్రాంతి సందర్భంగా పూణేలోని పురాతన గ్రామ దేవత శ్రీ కాలభైరవనాథ దేవాలయాన్ని వివిధ రంగులు, వివిధ పరిమాణాలలో ఉన్న గాలిపటాలతో అందంగా అలంకరించారు.

(2 / 5)
ఈ సందర్భంగా 200కు పైగా పతంగులను అలంకరించారు. ఆలయ పరిసరాలను రంగురంగుల గాలిపటాలతో ముస్తాబు చేశారు. సంక్రాంతి సందర్భంగా ఆలయ అలంకరణలను తిలకించేందుకు భక్తులు పోటెత్తారు.

(3 / 5)
శ్రీ బహిరోబా దేవ్ ట్రస్ట్ పూణేలోని పురాతన గ్రామ దేవత అయిన కస్బా పేఠే వద్ద శ్రీ కాల భైరవనాథ్ ఆలయం, క్షేత్రపాల్ శ్రీ కాలభైరవనాథ్ ఆలయం ద్వారా గాలిపటాల పండుగ నిర్వహించబడింది. గర్భగుడి మొత్తం కూడా మొత్తం గాలి పటాలతోనే అలంకరించడం ఇక్కడ ప్రత్యేకత. ఈ ఆలయాన్ని ఇప్పటికీ లడ్‌కట్ కుటుంబం నిర్వహిస్తోంది.

(4 / 5)
కస్బా పేత్ పూణేలోని 1200 సంవత్సరాల పురాతన స్థావరం ఇది. ఇక్కడ మూలా, ముక్తా, నాగ్ అనే మూడు నదుల పవిత్ర త్రివేణి సంగమం ఉంది.

(5 / 5)
పూణేలో నిర్వహించే ఈ గాలిపటాల పండుగ తిలకించేందుకు ఎంతో మంది భక్తులు తరలివస్తారు. ఎక్కడైనా పూలతో అలంకరిస్తారు కానీ ఇక్కడ మాత్రం దేవాలయంలో ఎక్కడ చూసినా కూడా గాలిపటాలే దర్శనం ఇస్తాయి.
ఇతర గ్యాలరీలు