(1 / 5)
భార్య రహస్య గోరఖ్‌తో కలిసి దిగిన ఫొటోలను కిరణ్ అబ్బవరం మంగళవారం సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
(2 / 5)
మా ప్రేమ పెరుగుతోంది అంటూ తాను తండ్రి కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. కిరణ్, రహస్య దంపతులకు ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతోన్నారు.
(3 / 5)
2019లో వచ్చిన రాజా వారు రాణి గారు మూవీలో కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్‌లోనే వీరి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారింది.
(4 / 5)
గత ఏడాది ఆగస్ట్‌లో కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ పెళ్లి చేసుకున్నారు. కూర్గ్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు.
(5 / 5)
ఇటీవలే క మూవీతో కెరీర్‌లోనే పెద్ద హిట్‌ను అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం దిల్ రుబా సినిమా చేస్తోన్నాడు.
ఇతర గ్యాలరీలు