తెలుగు న్యూస్ / ఫోటో /
కిమ్ జోంగ్ ఉన్‌కు చెందిన ఈ రైలు కదిలే కోట.. బోగీలన్నీ బుల్లెట్ ప్రూఫ్.. ఫైవ్ స్టార్ సౌకర్యాలు!
- kim jong un Special Train : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ జీవితం చాలా రహస్యంగా ఉంటుంది. అతనికి సంబంధించిన విషయాలు ఎక్కువగా బయటకు రావు. ఆయన రహస్య జీవితంలో ఒక భాగం అతని బుల్లెట్ ప్రూఫ్ రైలు.
- kim jong un Special Train : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ జీవితం చాలా రహస్యంగా ఉంటుంది. అతనికి సంబంధించిన విషయాలు ఎక్కువగా బయటకు రావు. ఆయన రహస్య జీవితంలో ఒక భాగం అతని బుల్లెట్ ప్రూఫ్ రైలు.
(1 / 5)
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ పేరు వింటేనే ప్రపంచంలోని కొన్ని దేశాలు వణికిపోతున్నాయి. అతని నిర్ణయాలు, శైలి, అతడి భద్రత ఎప్పుడూ వార్తల్లో ఉంటాయి. కానీ అతని రహస్య జీవితంలో ఒక భాగం అతని బుల్లెట్ ప్రూఫ్ రైలు. కిమ్ జోంగ్ ఉన్ భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తుంది ఈ రైలు.
(2 / 5)
కిమ్ జోంగ్ ఉన్ తరచుగా విమాన ప్రయాణాలకు దూరంగా ఉంటాడు. తన ప్రత్యేక రైలులో మాత్రమే ప్రయాణించడానికి ఇష్టపడతాడు. అతని తండ్రి కిమ్ జోంగ్ ఇల్ నుండి వచ్చిన ఈ రైలును 1950లలో యుద్ధ సమయంలో అతని తాత కిమ్ ఇల్ సంగ్ తన ప్రధాన కార్యాలయంగా ఉపయోగించుకున్నాడు. రైలులోని ప్రతి బోగీ బుల్లెట్ ప్రూఫ్, బాంబు పేలుళ్లు జరగకుండా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.
(3 / 5)
ఈ రైలు ప్రతి ప్రయాణానికి ముందు మొత్తం మార్గాన్ని ఒక రోజు ముందుగానే తనిఖీ చేస్తారు. రైలు ముందు, తరువాత కూడా భద్రతా రైళ్లు ఉంటాయి. కిమ్ జోంగ్ ఉన్ రైలు ట్రాక్‌పై ఎలాంటి ప్రమాదం లేదని కన్ఫామ్ అయ్యాకే వెళ్తాడు.
(4 / 5)
రైలులో మొత్తం 22 బోగీలు ఉన్నాయి. ఇవి పూర్తిగా లగ్జరీ సౌకర్యాలతో ఉంటాయి. పెద్ద డైనింగ్ హాళ్లు, ఆధునిక స్నానపు గదులు, వినోదం కోసం పరికరాలు ఉంటాయి. రైలులో కూడా ప్రపంచం నలుమూలల నుంచి ప్రఖ్యాతి గాంచిన చెఫ్‌లు ప్రత్యేక వంటకాలు తయారుచేస్తారు. కిమ్ జోంగ్ ఉన్ సుదీర్ఘ ప్రయాణాలను వినోదభరితంగా చేయడానికి అతనితో పాటు నృత్య కళాకారుల బృందం కూడా ఉంటుంది.
ఇతర గ్యాలరీలు