(1 / 5)
జూలై 29న థియేటర్లలో విడుదలైన సత్య ప్రేమ్ కీ కథ మూవీ 125 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. 2023లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన బాలీవుడ్ టాప్ టెన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
(2 / 5)
భూల్ భులయ్యా 2 తర్వాత కార్తిక్ ఆర్యన్, కియారా కాంబినేషన్‌లో సెకండ్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా సత్య ప్రేమ్ కీ కథ మూవీ నిలిచింది.
(3 / 5)
సత్య కీ ప్రేమ్ కథ మూవీకి సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహించాడు. నిరుద్యోగి అబ్బాయికి, శ్రీమంతుల ఇంటిలో పుట్టిన అమ్మాయికి మధ్య సాగే ప్రేమకథతో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా డైరెక్టర్ సమీర్ ఈ సినిమాను తెరకెక్కించాడు.
(4 / 5)
తొలుత ఈ సినిమాలో అనన్యా పాండేను హీరోయిన్‌గా ఎంపికచేశారు. కానీ అనివార్య కారణాల వల్ల ఆమె తప్పుకోవడంతో కియారాకు అవకాశం దక్కింది.
(5 / 5)
ప్రస్తుతం కియారా తెలుగులో రామ్‌చరణ్‌తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తోంది. ఈ పాన్ ఇండియన్ మూవీకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇతర గ్యాలరీలు