Kia EV9 Electric Car: డిఫరెంట్ లుక్‍తో అదిరిపోయేలా కియా ఈవీ9 ఎలక్ట్రిక్ కారు: ఫొటోలతో పాటు వివరాలు-kia ev9 might be the most butch looking electric suv know the details with pictures ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Kia Ev9 Might Be The Most Butch Looking Electric Suv Know The Details With Pictures

Kia EV9 Electric Car: డిఫరెంట్ లుక్‍తో అదిరిపోయేలా కియా ఈవీ9 ఎలక్ట్రిక్ కారు: ఫొటోలతో పాటు వివరాలు

Mar 15, 2023, 11:09 AM IST Chatakonda Krishna Prakash
Mar 15, 2023, 11:09 AM , IST

  • Kia EV9 Electric SUV: ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీని గ్లోబల్‍గా ఆవిష్కరించింది కియా. ఆటో ఎక్స్‌పో-2023లో ఈ కారు కాన్సెప్టును ప్రదర్శించగా.. ఇప్పుడు గ్లోబల్‍గా పరిచయం చేసింది కియా. చాలా డిఫరెంట్‍గా గంభీరమైన లుక్‍తో కియా ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ.. అదిరిపోయేలా ఉంది. అయితే, ఇండియాలో  ఇప్పట్లో ఈవీ9 లాంచ్ అయ్యేలా కనిపించడం లేదు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ గురించి ఫొటోలతో పాటు వివరాలు ఇక్కడ చూడండి.

గ్లోబల్ మార్కెట్‍లో ఫ్లాగ్‍షిప్ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీని కియా ఆవిష్కరించింది. కియా ఈవీ9 పేరుతో దీన్ని తీసుకొచ్చింది. ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించిన కాన్సెప్ట్ వెర్షన్‍నే కియా పరిచయం చేసింది. 

(1 / 11)

కియా ఈవీ9లో మూడు వరుసల (Three Row) సీటింగ్ ఉంటుంది. రెండో వరుసను 180 డిగ్రీలు తిప్పవచ్చు. దీంతో మూడో వరుస, రెండో వరుస ఉన్న వారు ఎదురెదురు కూర్చొని మాట్లాడుకోవచ్చు. మూడో వరుసలో కప్ హోల్డర్లు, మొబైల్ చార్జింగ్ పాయింట్లు కూడా ఉన్నాయి.

(2 / 11)

ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ (E-GMP) ప్లాట్‍ఫామ్  ఆధారంగా ఈ ఈవీ9ను కియా రూపొందించింది. 

(3 / 11)

ఈ ఎలక్ట్రిక్ కారులో ఉండే బ్యాటరీ సామర్థ్యాన్ని కియా ఇంకా వెల్లడించలేదు. అయితే 77.4 kWh బ్యాటరీ ఉంటుందని అంచనాలు ఉన్నాయి. 

(4 / 11)

కియా ఈవీ9 కేబిన్‍లో 12.3 ఇంచుల డ్యుయల్ స్క్రీన్స్ ఉన్నాయి. డ్రైవర్ డిజిటల్ డిస్‍ప్లే, ఇన్ఫోటైన్‍మెంట్ సిస్టమ్‍తో ఈ ప్రీమియమ్ ఎలక్ట్రిక్ కారు వస్తోంది.

(5 / 11)

సీట్లు చాలా సౌకర్యవంతంగా, డ్యుయల్ టౌన్ అప్‍హోల్‍స్టెరీని కలిగి ఉన్నాయి.

(6 / 11)

సీట్లు చాలా సౌకర్యవంతంగా, డ్యుయల్ టౌన్ అప్‍హోల్‍స్టెరీని కలిగి ఉన్నాయి.

మల్టీ ఫంక్షనల్‍ యూనిట్‍గా స్టీరింగ్ వీల్ ఉంటుంది. డ్యాష్ బోర్డు కూడా చూడడానికి చాలా మోడర్న్‌గా కనిపిస్తోంది.

(7 / 11)

ఆరు లేదా ఏడు సీటర్ ఎస్‍యూవీగా ఈవీ9ను కియా తీసుకొస్తోంది. ఫ్లష్‍డోర్ హ్యాండిల్స్, చార్జింగ్ పోర్ట్ ఉంటాయి. 

(8 / 11)

అయితే ఈవీ9 లైనప్‍లో ప్రతీ వెర్షన్ పనోరామిక్ సన్‍రూఫ్‍ను కలిగి ఉండేలా కనిపించడం లేదు. ఈ కారు వెనుక పొడవుగా ఎల్ఈడీ టైల్ ల్యాంప్స్ ఉన్నాయి. 

(9 / 11)

ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీలో స్టోరేజ్ ఆప్షన్లు కూడా చాలానే ఉన్నాయి. ఇంటీరియర్ స్పేస్‍ ఎక్కువగా ఉండేలా సెంటర్ కన్సోల్ డోర్లను కియా డిజైన్ చేసింది. 

(10 / 11)

కియా ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీకి హెడ్‍ల్యాంపులు నిలువుగా ఉన్నాయి. టైగర్ ఫేస్ గ్రిల్ ఇప్పుడు డిజిటల్‍గా మారిందని కియా పేర్కొంది.

(11 / 11)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు