రోజుకు ఆరు పూటల భోజనం, మజ్జిగ, నడక.. ఖుష్బూ బరువు తగ్గడం వెనుక సీక్రెట్ ఇదే-khushboo sundar weight loss journey eating 6 times daily walking actress reveals secrets ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  రోజుకు ఆరు పూటల భోజనం, మజ్జిగ, నడక.. ఖుష్బూ బరువు తగ్గడం వెనుక సీక్రెట్ ఇదే

రోజుకు ఆరు పూటల భోజనం, మజ్జిగ, నడక.. ఖుష్బూ బరువు తగ్గడం వెనుక సీక్రెట్ ఇదే

Published Apr 23, 2025 03:44 PM IST Hari Prasad S
Published Apr 23, 2025 03:44 PM IST

నటి ఖుష్బూ బరువు తగ్గి మెరుపు తీగలా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలుసు కదా. దీని వెనుక సీక్రెట్ ఏంటో ఆమె చెప్పుకొచ్చింది. రోజుకు ఆరు పూటల భోజనం చేసేదానినని ఆమె చెప్పడం విశేషం.

నటి ఖుష్బూ వెయిట్ లాస్ జర్నీ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో ఆమె తాను బరువు తగ్గడానికి పాటించిన చిట్కాల గురించి వెల్లడించింది.

(1 / 6)

న్యూ జనరేషన్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి ఖుష్బూ బరువు తగ్గడానికి గల కారణాన్ని వెల్లడించింది. ఆమె ఏమన్నదో చూడండి. "నాకు స్వీట్లంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఇండియాలో తయారైన స్వీట్స్ గురించి చెప్పనవసరం లేదు. కాబట్టి ఎక్కడైనా స్వీట్ కనిపిస్తే వెంటనే దాన్ని తీసుకుని నోట్లో వేసుకుంటాను.ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది అని ఆమె చెప్పింది.

(2 / 6)

స్వీట్లు తినడం వల్ల బరువు పెరిగి ఇబ్బందులు పడేదాన్నని, తర్వాత తన శరీరం గురించి అర్థం చేసుకోవడం మొదలుపెట్టినట్లు ఖుష్బూ తెలిపింది.

(3 / 6)

ఇంకా ఆ ఇంటర్వ్యూలో ఖుష్బూ ఏమన్నదంటే.. “అదృష్టవశాత్తూ నాకు డయాబెటిస్ లేదా అధిక రక్తపోటు లేదు, కానీ నాకు నా మోకాలితో సమస్య ఉంది, మోకాలి గాయానికి నాకు దాదాపు మూడు శస్త్రచికిత్సలు జరిగాయి. అందుకే బరువు తగ్గాలని డాక్టర్ చెప్పారు. అప్పుడే నేను ప్రతిరోజూ నడకకు వెళ్లడం ప్రారంభించాను. నేను నా భోజనంపై నియంత్రణ సాధించాను. స్వీట్లతో సహా ఆహార పదార్థాలను తినడాన్ని నియంత్రించుకున్నాను”అని చెప్పింది.

(4 / 6)

బరువు తగ్గానికి తాను తీసుకున్న మరికొన్ని చర్యల గురించి కూడా ఖుష్బూ తెలిపింది. “ఇంతకు ముందు నేను ఆరేడు కప్పుల టీ తాగేదాన్ని. దాన్ని కూడా తగ్గించాను. ఒకేసారి భోజనంలో ఎక్కువగా తినడానికి బదులుగా, దానిని విడదీసి 6 సార్లు తినడం మొదలుపెట్టాను. మజ్జిగ, కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగాను”అని చెప్పింది.

(5 / 6)

తన శరీరానికి అనుగుణంగా తన జీవితాన్ని మార్చుకున్నట్లు ఖుష్బూ వివరించింది. బరువు తగ్గడం వల్ల ఇప్పుడు తన జీవితం ఎంతో ప్రశాంతంగా ఉందని ఆమె చెప్పింది.

(6 / 6)

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు