Priyanka Gandhi : తెలంగాణ సిరి సంపదలు ప్రజలకు పంచాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి - ప్రియాంక గాంధీ-khammam news in telugu priyanka gandhi says telangana people desire not fulfilled in kcr govt ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Priyanka Gandhi : తెలంగాణ సిరి సంపదలు ప్రజలకు పంచాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి - ప్రియాంక గాంధీ

Priyanka Gandhi : తెలంగాణ సిరి సంపదలు ప్రజలకు పంచాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి - ప్రియాంక గాంధీ

Nov 25, 2023, 04:09 PM IST HT Telugu Desk
Nov 25, 2023, 04:09 PM , IST

  • Priyanka Gandhi : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సిరి సంపదలు, శక్తి మీ చేతుల్లోకి వస్తాయని అందరూ కలలు కన్నారని ప్రియాంక గాంధీ తెలిపారు. తెలంగాణ ప్రజలు కన్న కలలను బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.

"మీలో ఏ ఒక్కరికైనా ఉద్యోగాలు వచ్చాయా? కేసీఆర్ కుటుంబంలో మాత్రం ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు వచ్చాయి.. తెలంగాణలోని నా సోదర సోదరీమణులందరికీ ఉద్యోగాలు రావాలంటే మీరు కోరుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి.. మీ శక్తితో నిర్మించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం మీదే.. మీరు కోరుకున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మీ సొంత కలను నెరవేర్చుకోండి.." అంటూ కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ ఖమ్మంలో చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.  

(1 / 7)

ఖమ్మం నడి బొడ్డున ఉన్న అంబేడ్కర్ సెంటర్ నుంచి పెద్దతండా వరకు ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలను కలుపుతూ ఏర్పాటు చేసిన రోడ్ షో ఆసాంతం ఆకర్షణీయంగా సాగింది. భారీ రోడ్ షో అనంతరం పెద్దతండా వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. ఈ రాష్ట్రం మీ అందరి శ్రమతో ఏర్పడిందని, రైతులు, ఆడ బిడ్డలు, యువత ఈ రాష్ట్రాన్ని నిర్మించుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక ఈ రాష్ట్రం సిరి సంపదలు, శక్తి మీ చేతుల్లోకి వస్తాయని అందరూ కలలు కన్నారని తెలిపారు. మీరు కన్న కలలు ఏమాత్రం నిజం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.   

(2 / 7)

బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి తెలంగాణను భ్రష్టు పట్టించిందని ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు. మీకోసం కేసీఆర్ కుటుంబం ఏమీ చేయలేదని విమర్శించారు. అందరికీ ఇల్లు, అర్హులైన యువతకు ఉద్యోగాలు వచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ యువతకు ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ రాష్ట్ర సిరి సంపదలు ప్రజలకు పంచాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. 

(3 / 7)

మహిళలు ఆర్థికంగా వారి కాళ్లపై వాళ్లు నిలబడే రోజు రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రియాంక గాంధీ తెలిపారు. రైతుల రుణం పూర్తిగా మాఫీ అవ్వాలంటే కాంగ్రెస్ సర్కారు రావాలన్నారు. శక్తివంతమైన ప్రభుత్వం, అందరి కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. రోడ్ షో ప్రియాంక గాంధీ చిన్నారులను ఎత్తుకొని ముద్దాడటం, రేవంత్ రెడ్డి పాటకు నృత్యం చేయడం అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రియాంక గాంధీకి స్థానిక మహిళలు బిందెలు నెత్తికెత్తుకుని ప్రదర్శనగా ఆహ్వానం పలికారు. ఆమె వెంట సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల అభ్యర్థులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.

(4 / 7)

హైదరాబాద్‌ను ఇస్తాంబుల్‌గా మారుస్తానని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇక్కడి ప్రజల కలలు, ఆకాంక్షలను తుడిచిపెట్టేశారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

(5 / 7)

శనివారం సనత్ నగర్ కార్నర్ మీటింగ్ పాల్గొన్న ఖర్గే... హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చింది కాంగ్రెస్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం హైదరాబాద్‌లో మెట్రో నిర్మాణాన్ని ఆలస్యం చేశాయన్నారు. హైదరాబాద్ మెట్రో మొదటి దశను కాంగ్రెస్ అమలు చేసిందన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలన వల్ల హైదరాబాద్‌లో రోడ్లు, గుంతలు, నీటి ఎద్దడి, వరదలు ఏర్పడ్డాయన్నారు. 

(6 / 7)

కాంగ్రెస్ పాలన ఫలితంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం జరిగిందని మల్లికార్జున ఖర్గే అన్నారు. కోల్పోయిన హైదరాబాద్‌ వైభవాన్ని కాంగ్రెస్‌ తిరిగి తీసుకొస్తుందని హామీ ఇచ్చారు.  

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు