Khairatabad Ganesh 2024 : ఖైరతాబాద్ మహాగణపతి హుండీ ఆదాయం ఎంతో తెలుసా?
- Khairatabad Ganesh 2024 : ఖైరతాబాద్ మహాగణపతి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో మొదటిసారి హుండీల లెక్కింపు చేపట్టారు. మంగళవారం ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనాల దృష్ట్యా మెట్రోరైలు సమయం పొడిగించారు.
- Khairatabad Ganesh 2024 : ఖైరతాబాద్ మహాగణపతి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో మొదటిసారి హుండీల లెక్కింపు చేపట్టారు. మంగళవారం ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనాల దృష్ట్యా మెట్రోరైలు సమయం పొడిగించారు.
(1 / 5)
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతి హుండీ ఆదాయం రూ. 70 లక్షలు వచ్చింది. హోర్డింగులు, ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరో రూ. 40 లక్షలు వచ్చాయి. ఖైరతాబాద్‌లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో మొదటిసారి హుండీల లెక్కింపు చేపట్టారు. పది రోజుల్లో నగదు రూపంలో ఈ ఆదాయం సమకూరినట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. (@jsuryareddy)
(2 / 5)
మంగళవారం ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం కానుంది. సోమవారం రాత్రి 9 గంటలకు మహా హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. రాత్రి11:30 నిమిషాలకు కలశం పూజ ఉంటుంది. ఈరోజే మహా గణపతిని పూజారులు కదిలించనున్నారు. రాత్రి 12 గంటల తర్వాత టస్కర్‌పైకి మహా గణపతిని ఎక్కించనున్నారు. రేపు మధ్యాహ్నం క్రేన్ దగ్గరికి ఖైరతాబాద్ గణపతి చేరుకోనున్నారు. 2 గంటల్లో నిమజ్జనం పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. (X)
(3 / 5)
గణేశ్ నిమజ్జనాల దృష్ట్యా మెట్రోరైలు సమయం పొడిగించారు. అర్థరాత్రి 2 గంటల వరకు మెట్రోరైళ్లు పరుగులు తీయనున్నాయి. అన్ని మార్గాల్లో అర్థరాత్రి 1 గంటలకు చివరి రైళ్లు బయలుదేరనున్నాయి. రేపు అర్థరాత్రి 2 గంటలకు గమ్యస్థానాలకు చేరుకోనున్నాయి. ఖైరతాబాద్, లక్డికాపూల్ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. (PTI)
(4 / 5)
నిమజ్జన ఏర్పాట్లై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సమీక్షకు హాజరయ్యారు. 733 సీసీ కెమెరాలతో నిమజ్జనాల పర్యవేక్షణ ఉండనుంది. ట్యాంక్‌బండ్, మండపాలు, చెరువుల దగ్గర ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. (CMO)
(5 / 5)
రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. మొత్తం 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయని పోలీసులు చెప్పారు. ట్యాంక్ బండ్ దగ్గర 8 చోట్ల పార్కింగ్ సదుపాయం ఉంది. రేపు ఉదయం 6 నుంచి ఎల్లుండి ఉదయం 8 వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. 2 గంటల్లోనే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం ఉంటుంది. సిటీలోకి భారీ వాహనాలకు పర్మిషన్ లేదని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.(@HYDTP)
ఇతర గ్యాలరీలు