Telangana TET 2024 : ఇక ఏటా 2 సార్లు 'టెట్' ఎగ్జామ్...! తాజా అప్డేట్ ఇదే
- Telangana TET Exam 2024 Updates :మెగా DSC నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో మరోసారి టెట్ పరీక్ష నిర్వహించాలనే డిమాండ్ నిరుద్యోగుల నుంచి వినిపిస్తోంది. టెట్ నిర్వహిస్తే... చాలా మంది అభ్యర్థులకు లబ్ధి చేకూరుతుందని అంటున్నారు. మరోవైపు టెట్ పరీక్షను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది.

(1 / 5)
11వేలకుపైగా పోస్టులతో మెగా డీఎస్సీని విడుదల చేసింది తెలంగాణ సర్కార్. మార్చి 4వ తేదీ నుంచి దరఖాస్తులు కూడా ప్రారంభం కానున్నాయి.
(2 / 5)
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో… మరోసారి టెట్ నిర్వహించాలని చాలా మంది అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. టెట్ నిర్వహించటం ద్వారా తమకు కూడా డీఎస్సీ పరీక్ష రాసే అవకాశం దక్కుతుందని చెబుతున్నారు.
(3 / 5)
ఇప్పటికే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో…. టెట్ పరీక్షకు సంబంధించి విద్యాశాఖ నుంచి ప్రకటన రావాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే…. ప్రతి ఏడాది రెండుసార్లు టెట్ పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
(4 / 5)
ఇక నుంచి ఏటా 2 సార్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి కసరత్తును కూడా ప్రారంభించింది..ప్రతి ఏటా జూన్, డిసెంబర్ /జనవరిలో నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది. ఎన్సీటీఈ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని చూస్తోంది.
ఇతర గ్యాలరీలు