TG New Ration Cards : కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్నారా..? తాజా అప్డేట్ ఇదే...!-key updates about sanction of new ration cards in telangana ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tg New Ration Cards : కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్నారా..? తాజా అప్డేట్ ఇదే...!

TG New Ration Cards : కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్నారా..? తాజా అప్డేట్ ఇదే...!

Jul 06, 2024, 01:02 PM IST Maheshwaram Mahendra Chary
Jul 06, 2024, 01:02 PM , IST

  • New Ration Cards in Telangana : త్వరలోనే తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. పాత వాటిస్థానంలో కొత్త రూపంలో కార్డులు అందించనున్నారు. ఈ ప్రక్రియ కోసం అధికారికంగా ఉత్తర్వులు జారీ కానున్నాయి. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…..

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఇప్పటికే ఆ దిశగా కసరత్తు చేయగా.. ఎన్నికల కోడ్ తర్వాత ఆగిపోయింది. కోడ్ ఎత్తివేయటంతో కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

(1 / 5)

కొత్త కార్డుల మంజూరుపై  కేబినెట్ భేటీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  ఆ వెంటనే ఉత్తర్వులు జారీ అవుతాయని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి.  కొత్త కార్డుల కోసం అవకాశం ఇస్తే… మరో 10 లక్షలు కుటుంబాల నుంచి దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

(2 / 5)

ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా తెల్ల కాగితంపై రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల వివరాలను చేర్చే వారి నుంచి కూడా అప్లికేషన్లను తీసుకుంది. అయితే వీటి కోసం సదరు కుటుంబాలు… తెల్ల కాగితంపై రాసి దరఖాస్తు చేసుకున్నాయి.

(3 / 5)

రేషన్ కార్డుల నిర్ణయం తీసుకుంటే… ఈసారి మీసేవా పోర్టల్ ద్వారా స్వీకరించే అవకాశం ఉంది. కేవలం కొత్త రేషన్ కార్డులే కాకుండా… పాత కార్డుల్లో కూడా పేరు నమోదు కాని కుటుంబ సభ్యుల వివరాలను ఎంట్రీ చేసేందుకు వీలుగా ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. 

(4 / 5)

మొత్తంగా చూస్తే రుణమాఫీ స్కీమ్ ను పట్టాలెక్కించేందుకు సిద్ధమైన సర్కార్… అతి త్వరలోనే రేషన్ కార్డుల మంజూరుపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు