(1 / 7)
కీలకమైన పథకాల అమలు కోసం తెలంగాణ సర్కార్ ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… దరఖాస్తులను స్వీకరించింది.గతేడాది డిసెంబర్ 28 జనవరి 6 వరకు కొనసాగింది. ఇందులో భాగంగా… అర్హులైన వారి నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఏకంగా కోటిపైగా అప్లికేషన్లను స్వీకరించారు అధికారులు. మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి.
(https://prajapalana.telangana.gov.in/)(2 / 7)
అయితే ఈ వివరాలను అధికారులు ఆన్ లైన్ చేశారు. ప్రస్తుతం పలు పథకాలకు ఈ వివరాల ఆధారంగా సర్వే నిర్వహిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు ఇదే తరహాలో సర్వే చేస్తున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి వద్ద నుంచి వివరాలను సేకరిస్తున్నారు.
(3 / 7)
అయితే ప్రజాపాలన కార్యక్రమంలో పలువురు అప్లికేషన్ చేసుకోలేదు. దీంతో వారంతా గందరగోళానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతున్న వేళ… తాము దరఖాస్తు చేసుకోవడానికి మరో అవకాశం లేదా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే వీరికి ప్రభుత్వం కీలక అప్జేట్ ఇచ్చింది. అర్హత ఉండి ప్రజాపాలన యాప్ లో నమోదు కానీ దరఖాస్తులు మ్యానువల్ గా నమోదు చేస్తామని ప్రకటించింది. ఇదే విషయాన్ని తాజాగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధ్రువీకరించారు.
(4 / 7)
కాంగ్రెస్ హయంలో సంక్షేమం అనేది నిరంతర ప్రక్రియ అని మంత్రి పొంగులేటి చెప్పారు. ఈ నెల 26నుంచి ప్రతిష్టాత్మకంగా మరో నాలుగు హామీలు అమలు చేయబోతున్నామని చెప్పారు. అర్హత ఉండి ప్రజాపాలన యాప్ లో నమోదు కానీ దరఖాస్తులు మ్యానువల్ గా నమోదు చేస్తామన్నారు. ఇటీవలే హన్మకొండ ఐడీవోసీలో జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులతో సమావేశంలో మంత్రి పొంగులేటి ఈ విషయాన్ని ప్రస్తావించారు.
(5 / 7)
అయితే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోలేని వారు… ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కేంద్రాల్లో స్పెషల్ డెస్క్ లు ఏర్పాటు చేశారు. ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ కాకుండా.. తెల్ల కాగితంపై కూడా మీ వివరాలను రాసి ఇవ్వొచ్చు.
(CMO Telangana)(6 / 7)
ఎంపీడీవో కార్యాలయాల్లో తీసుకునే దరఖాస్తులను కలెక్టరేట్ కు పంపిస్తున్నట్లు తెలిసింది. వీటిని పరిశీలించి… ఆన్ లైన్ లో ఎంట్రీ చేస్తున్నారు. అర్హత కలిగి ఉన్న వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే… ఎంపీడీవో కార్యాలయం లేదా గ్రామంలోని పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
(7 / 7)
కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి వివరాలను ఆన్ లైన్ చేసిన తర్వాత… వారి వివరాలను కూడా పరిశీలించి సర్వే నిర్వహిస్తారు. అర్హత ఉంటే సంబంధిత పథకాలకు అర్హులవుతారు.
ఇతర గ్యాలరీలు