(1 / 6)
రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయంగా అందించనుంది.
(2 / 6)
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు.రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6,000లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 కలిపి మొత్తం రూ.20 వేలను అందజేయనుంది. నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. 3 దఫాల్లో ఈ మొత్తాన్ని అందజేస్తారు.
(3 / 6)
రైతులంతా ఈకేవైసీ (వేలిముద్ర) పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులు ఇటీవలే పలు ప్రకటనలు చేశారు. దీంతో రైతులంతా రైతు సేవా కేంద్రాలకు వెళ్తున్నారు. దీంతో ఆయా కేంద్రాల వద్ద ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అంతేకాదు తమకు స్కీమ్ వర్తింపజేస్తారా లేదా అన్న ఆందోళనలో కూడా రైతులు ఉంటున్నారు.
(4 / 6)
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులు అంతా ఈకేవైసీ కోసం రైతు సేవా కేంద్రాల(RSK)కు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
అర్హులైన 45.65 లక్షల మంది రైతుల్లో 44.19 లక్షల మంది వివరాలు ఆటో అప్డేట్ చేసినట్లు వెల్లడించింది.
(5 / 6)
సరైన వివరాలు లేని 1.45 లక్షల మంది మాత్రమే వేలిముద్ర వేస్తే సరిపోతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఆ రైతుల వివరాలను RSKలకు పంపింది. ఈ నెల 20కల్లా ఈ ప్రక్రియ పూర్తికానుందని పేర్కొంది.
(6 / 6)
అన్నదాత సుఖీభవ స్కీమ్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా అని తెలుసుకునేందుకు ముందుగా అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్ సైట్ https://annadathasukhibhava.ap.gov.in/ లోకి వెళ్లాలి. హోంపేజీలో కనిపింటే 'Know Your Status' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. పక్కనే ఉండే సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే రైతు దరఖాస్తు స్టేటస్ డిస్ ప్లే అవుతుంది. దీనిబట్టి ఈకేవైసీ విషయంలో కూడా ఓ క్లారిటీకి రావొచ్చు.
ఇతర గ్యాలరీలు