(1 / 6)
(2 / 6)
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. ఆ సమయంలో కార్డులను కూడా పంపిణీ చేశారు. అప్పట్నుంచి… ఇవాళ్టి వరకు కొత్త కార్డులను మంజూరు చేయలేదు.
(https://rajivaarogyasri.telangana.gov.in/)(3 / 6)
తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోగ్య శ్రీ స్కీమ్ పై లోతుగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శ్రీ సేవల వివరాలను తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
(https://rajivaarogyasri.telangana.gov.in/)(4 / 6)
కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన ఉండటంతో చాలా మంది ఈ స్కీమ్ పరిధిలోకి రాలేకపోతున్నారు. అయితే ఈ నిబంధనను సడలించే అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులను కూడా ఆదేశించారు.
(https://rajivaarogyasri.telangana.gov.in/)(5 / 6)
ముఖ్యమంత్రి ఆదేశాలతో తెల్లరేషన్ కార్డు లేకుండానే ఆరోగ్య శ్రీ కార్డులను మంజూరు చేసే అంశంపై కసరత్తు చేస్తున్నారు వైద్యారోగ్యశాఖ అధికారులు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఆదేశాలు రావొచ్చు.
(https://rajivaarogyasri.telangana.gov.in/)(6 / 6)
మరోవైపు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ నంబర్ తో అనుసంధానం చేయాలని సూచించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని అన్నారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీ ని అనుసంధానం చేయాలని దిశానిర్దేశం చేశారు.
(https://rajivaarogyasri.telangana.gov.in/)ఇతర గ్యాలరీలు