కొనసాగుతున్న 'స్పాట్ వాల్యుయేషన్' - తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలపై అప్డేట్స్ ఇవే-key update on the release of telangana inter supplementary results 2025 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  కొనసాగుతున్న 'స్పాట్ వాల్యుయేషన్' - తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలపై అప్డేట్స్ ఇవే

కొనసాగుతున్న 'స్పాట్ వాల్యుయేషన్' - తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలపై అప్డేట్స్ ఇవే

Published Jun 02, 2025 10:28 AM IST Maheshwaram Mahendra Chary
Published Jun 02, 2025 10:28 AM IST

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ముగిశాయి. ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా 4.2లక్షల విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ప్రస్తుతం జవాబుపత్రాల మూల్యాంకనం కొనసాగుతోంది. ఫలితాల విడుదలపై అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి…

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ముగిశాయి. ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా 4.2లక్షల విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. మే 29వ తేదీతో ఈ ఎగ్జామ్స్ అన్ని ముగిశాయి.

(1 / 7)

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ముగిసిన వెంటనే అధికారులు వాల్యుయేషన్ ప్రక్రియను చేపట్టారు. మొత్తం రెండు విడతల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ పూర్తి కాగా…  మే 31 నుంచి రెండో విడత మూల్యాంకనం నడుస్తోంది.

(2 / 7)

వాల్యుయేషన్ ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు చోటు ఇవ్వొద్దని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. జూన్ 6వ తేదీ నాటికి వాల్యుయేషన్ ప్రక్రియను మొత్తం పూర్తి చేయనున్నారు.

(3 / 7)

స్పాట్ పూర్తి కాగానే… ఆ వెంటనే  ప్రాక్టికల్స్‌ సహా ఇంటర్నల్స్‌ పరీక్షలను పూర్తి చేయనున్నారు. వీటన్నింటిని క్రోడీకరించిన తర్వాత… సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ప్రకటించనున్నారు.

(4 / 7)

జూన్ 2 వారంలోపు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను ప్రకటించే ఆలోచనలో ఇంటర్ బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమికంగా జూన్ 13 లేదా 14 తేదీలో ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారికంగా బోర్డు ప్రకటన చేస్తుంది.

(5 / 7)

(unsplash)

జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు రెండు సెషన్లలో ప్రాక్టికల్‌ పరీక్షలు జరగనున్నాయి. జూన్‌ 9న ఇంటర్‌ ఫస్ట్ ఇయర్, 10న సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లిష్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఉంటాయి.

(6 / 7)

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను https://results.cgg.gov.in/ వెబ్ సైట్ లేదా ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

(7 / 7)

(Mohammed Aleemuddin)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు