Rythu Bandhu Scheme Updates : ఎన్నికల కోడ్ రాకముందే నిధుల జమ పూర్తి...! 'రైతుబంధు స్కీమ్' తాజా అప్డేట్ ఇదే-key update about the deposit of rythubandhu funds to farmers ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Rythu Bandhu Scheme Updates : ఎన్నికల కోడ్ రాకముందే నిధుల జమ పూర్తి...! 'రైతుబంధు స్కీమ్' తాజా అప్డేట్ ఇదే

Rythu Bandhu Scheme Updates : ఎన్నికల కోడ్ రాకముందే నిధుల జమ పూర్తి...! 'రైతుబంధు స్కీమ్' తాజా అప్డేట్ ఇదే

Mar 03, 2024, 12:36 PM IST Maheshwaram Mahendra Chary
Mar 03, 2024, 12:36 PM , IST

  • Telangana Rythu Bandhu Scheme Updates: రైతుబంధు నిధుల జమకు సంబంధించి కీలక అప్డేట్ అందింది.  ప్రస్తుతం 3 నుంచి 4 ఎకరాలలోపు భూమి ఉన్నవారికి నిధులు జమ అవుతున్నాయి. అయితే నిధుల జమపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. 

రైతుబంధు నిధుల జమ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం 3 నుంచి నాలుగు ఎకరాలలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి.

(1 / 6)

అయితే ఏ క్షణమైనా లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కోడ్ రాకముందే మిగిలిన రైతుల ఖాతాల్లో కూడా నిధులను జమ చేయాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

(2 / 6)

ప్రతి ఒక్కరికి పంట పెట్టుబడి సాయం అందజేస్తామని కొడంగల్ సభ వేదికగా ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి… మరోసారి ఆర్థికశాఖకు ఆదేశాలు ఇచ్చారు. పది రోజుల్లో నిధుల జమ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు.

(3 / 6)

ఈ వారం, పది రోజుల్లో రోజూ కొంత మొత్తం చొప్పున నిధులు జమ చేస్తూ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది. అయితే ఎన్ని ఎకరాలలోపు ఉన్న వారికి ఈ నిధులను జమ చేస్తారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. 

(4 / 6)

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మిగిలిన రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యే అవకాశం ఉంది. అయితే ఎన్ని ఎకరాలలోపు ఉన్న వారికి వేస్తారనేది తేలాల్సి ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. సీలింగ్ పెట్టాలని గట్టిగా భావిస్తున్న కాంగ్రెస్ సర్కార్…. ఐదు ఎకరాలకు పరిమితం చేస్తుందా లేక పది ఎకరాల వరకు సీలింగ్ పెడుతుందా అనేది తేలాల్సి ఉంది. గతంలో మాదిరిగానే ఈసారికి రైతుబంధు నిధులను జమ చేస్తామని ప్రభుత్వం ఏర్పాటైన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. కానీ రైతుబంధు ప్లేస్ లో రైతుభరోసా స్కీమ్ ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. ఎకరానికి రూ. 15వేలు ఇస్తామని ప్రకటించింది. ఈ స్కీమ్ ను వచ్చే సీజన్ కు వర్తింపజేసే అవకాశం ఉంది.

(5 / 6)

గత ప్రభుత్వంలో రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధు స్కీమ్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎకరానికి రూ. 5వేలను జమ చేస్తూ వచ్చింది. అయితే ఎన్నికల హామీలో భాగంగా... కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ స్కీమ్ పై ప్రకటన చేసింది. రైతుభరోసా స్కీమ్ కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది. ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం అందజేస్తామని పేర్కొంది.  వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో రైతుబంధు స్కీమ్ త్వరలోనే రైతుభరోసాగా మారనుండగా… స్పష్టమైన మార్గదర్శకాలు కూడా వెలువడే అవకాశం ఉంది. రైతుభరోసా స్కీమ్  వచ్చే ఖరీఫ్ నుంచి అమలయ్యే అవకాశం ఉంది.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు