(1 / 7)
పంట పెట్టుబడి సాయం కోసం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా స్కీమ్ ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వానాకాలం సీజన్ రావటంతో… ఈ స్కీమ్ కింద ఇచ్చే డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది.
(2 / 7)
జూన్ 16వ తేదీ నుంచి అర్హులైన రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు వస్తున్నాయి. ప్రస్తుతం ఎకరానికి రూ. 6 వేలు అందజేస్తున్నారు. అయితే కొత్తగా పట్టాదారు పుస్తకం వచ్చిన వాళ్లు కూడా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని వ్యవసాయశాఖ కల్పించింది.
(3 / 7)
05-06-2025 లోపు భూ భారతి పోర్టల్ లో కొత్తగా నమోదైన రైతులు కూడా… రైతు భరోసాకి దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయశాఖ తెలిపింది. అయితే వీరంతా జూన్ 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది.
(image source unsplash)(4 / 7)
కొత్త దరఖాస్తుదారులు…. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలి. వ్యవసాయశాఖ రూపొందించిన అప్లికేషన్ ఫారమ్ నింపి… మండలంలోని వ్యవసాయ అధికారులకు(వ్యవసాయ విస్తరణ అధికారికి ) అందజేయాల్సి ఉంటుంది. జూన్ 20లోపే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.
(image source .istockphoto.com)(5 / 7)
గతంలో రైతు భరోసా పొంది బ్యాంక్ ఖాతా మార్పిడి చేసుకోవాలనుకునే రైతులకు కూడా వ్యవసాయశాఖ మరో ఆప్షన్ ఇచ్చింది. వ్యవసాయ విస్తరణ అధికారికి బ్యాంకు ఖాతా మార్పిడికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించి పత్రాలను ఇస్తే సరిపోతుంది. ఈ ప్రక్రియ కూడా రేపటిలోపే పూర్తి చేసుకోవాలి.
(6 / 7)
జూన్ 20లోపు వచ్చిన కొత్త దరఖాస్తులను వ్యవసాయశాఖ అధికారులు పరిశీలిస్తారు. అర్హులను గుర్తించి… ప్రస్తుతం ఇస్తున్న విడత కిందనే డబ్బులను జమ చేస్తారు. కాబట్టి అర్హత ఉన్న రైతులు… వెంటనే దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.
(7 / 7)
రైతు భరోసా స్కీమ్ ద్వారా అర్హులైన అన్నదాతలకు ఏడాదికి రూ. 12వేల సాయం అందిస్తారు. ఒక విడతలో రూ. 6 వేలు, మరో విడుతలో రూ. 6 వేలు జమ చేస్తారు. ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వే చేసిన ప్రభుత్వం… సాగు చేసే, వ్యవసాయ యోగత్య ఉన్న భూములకే రైతు భరోసా అందిస్తుంది.
ఇతర గ్యాలరీలు