కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నారా..? అయితే మీకార్డు కోసం రెడీగా ఉండండి, తాజా అప్డేట్ ఇదే-key update about telangana new ration cards distribution ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నారా..? అయితే మీకార్డు కోసం రెడీగా ఉండండి, తాజా అప్డేట్ ఇదే

కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నారా..? అయితే మీకార్డు కోసం రెడీగా ఉండండి, తాజా అప్డేట్ ఇదే

Published Jul 02, 2025 05:48 PM IST Maheshwaram Mahendra Chary
Published Jul 02, 2025 05:48 PM IST

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. జూలై 14వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం షురూ కానుంది. తుంగతుర్తి నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకు సర్కార్ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. జూలై 14వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం షురూ కానుంది. తుంగతుర్తి నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

(1 / 7)

ఇప్పటికే మీసేవాతో పాటు ఆఫ్ లైన్ నూ దరఖాస్తుల స్వీకరిస్తున్నారు. విచారణ తర్వాత… కొత్తగా కార్డులను మంజూరు చేస్తున్నారు. అంతేకాకుండా పేర్లను కూడా జత చేస్తున్నారు. అయితే వీటికి సంబంధించిన కార్డులను ముద్రిస్తున్న సర్కార్…. జూలై 14వ తేదీ నుంచి పంపిణీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది.

(2 / 7)

 తొలి విడతలో మొత్తం 2 లక్షలకు పైగా లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ వర్గాల మేరకు తెలుస్తోంది. ఇందుకోసం అర్హత పొందిన దరఖాస్తుదారుల జాబితాను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. ఇందులో ఉన్న పేర్లకు సంబంధించిన కార్డులను ముందుగా అందజేస్తారు.

(3 / 7)

స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే డిజైన్ ను ఖరారు చేసినప్పటికీ… ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు.

(4 / 7)

ఇక రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కార్డులు అందజేస్తామని అధికారులు కూడా చెబుతున్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు.

(5 / 7)

రేషన్ కార్డు నెంబర్ ఆధారంగా అధికారిక వెబ్‌సైట్‌లో తమ కార్డును నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డులో కుటుంబసభ్యుల పూర్తి వివరాలు చూపిస్తాయి. అధికారిక వెబ్‌సైట్‌ లో రిఫరెన్స్ నెంబర్ లేదా కొత్త లేదా పాత రేషన్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత జిల్లా పేరును సెలెక్ట్ చేసి సెర్చ్ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. వెబ్ సైట్ లో రేషన్ కార్డు స్థితి తెలియకపోతే స్థానిక మండల ఆఫీసుల్లో తమ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు.

(6 / 7)

రేషన్ కార్డు నెంబర్ ఆధారంగా అధికారిక వెబ్‌సైట్‌లో తమ కార్డును నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డులో కుటుంబసభ్యుల పూర్తి వివరాలు చూపిస్తాయి. అధికారిక వెబ్‌సైట్‌ లో రిఫరెన్స్ నెంబర్ లేదా కొత్త లేదా పాత రేషన్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత జిల్లా పేరును సెలెక్ట్ చేసి సెర్చ్ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. వెబ్ సైట్ లో రేషన్ కార్డు స్థితి తెలియకపోతే స్థానిక మండల ఆఫీసుల్లో తమ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు.

దరఖాస్తుదారుడు https://epds.telangana.gov.in/FoodSecurityAct/ వెబ్ సైట్ లింక్ పై క్లిక్ చేయండి. హోంపేజీలో 'FSC Search' ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత పేజీలో 'Ration Card Search' డ్రాప్ డౌన్ లో 'FSC Search' ఆప్షన్ పై క్లి్క్ చేయండి. అనంతరం ఎఫ్ఎస్సీ రిఫరెన్స్ నెంబర్ లేదా పాత రేషన్ కార్డు లేదా ప్రస్తుత రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. మీ జిల్లాను ఎంపిక చేసి సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. రేషన్ కార్డు పూర్తి వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.

(7 / 7)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు