TS Govt Praja Palana Applications : అలా చేసి ఉంటే లెక్కలోకి ఒకే అప్లికేషన్...! 'ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్' తాజా అప్డేట్ ఇదే-key update about selection process of indiramma indlu housing scheme in telangana ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ts Govt Praja Palana Applications : అలా చేసి ఉంటే లెక్కలోకి ఒకే అప్లికేషన్...! 'ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్' తాజా అప్డేట్ ఇదే

TS Govt Praja Palana Applications : అలా చేసి ఉంటే లెక్కలోకి ఒకే అప్లికేషన్...! 'ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్' తాజా అప్డేట్ ఇదే

Jan 27, 2024, 11:50 AM IST Maheshwaram Mahendra Chary
Jan 27, 2024, 11:50 AM , IST

  • Indiramma Indlu Housing Scheme in Telangana: ఐదు గ్యారెంటీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ అప్లికేషన్స్ లో ఇందిరమ్మ ఇళ్ల కోసం 84 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. 

గత నెల డిసెంబర్ 28 నుంచి  జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. పథకాల కోసం మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో అత్యధికంగా ఇళ్లు, చేయూత, రేషన్ కార్డుల కోసం ఎక్కువగా అప్లికేషన్లు వచ్చాయి.

(1 / 5)

గత ప్రభుత్వంలో ఇచ్చిన గృహలక్ష్మి దర­ఖాస్తులను కాంగ్రెస్‌ సర్కార్ రద్దు చేయడంతో.. వారంతా తిరిగి దరఖాస్తు చేసుకున్నారు.  మొత్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు ఇచ్చారు. వీటి సంఖ్య 80 లక్షలకు పైగా ఉంది.

(2 / 5)

భారీగా దరఖాస్తులు రావటంతో వడపోత కార్యక్రమానికి చేపట్టింది సర్కార్. చాలా మంది వేర్వురు ప్రాంతాల్లో ఇళ్ల స్కీమ్ కోసం దరఖాస్తులు పెట్టినట్లు గుర్తించారు. ఒకే ఫ్యామిలీ నుంచి ఒకటికి మించి అప్లికేషన్స్ వచ్చాయి.

(3 / 5)

ఈ స్కీమ్ కింద గృహనిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందిచనుంది. ఈ నేపథ్యంలో ఈ స్కీమ్ పకడ్బందీగా అమలు చేయాలని చూస్తోంది. అయితే ఒకే ఆధార్ నెంబర్ తో వేర్వురు ప్రాంతాల్లో చేసిన దరఖాస్తులను గుర్తించేందుకు  ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సేవలను వినియోగించుకునే ఆలోచనలో ఉంది. ఫలితంగా ఏదో ఒక చోట స్వీకరించిన దరఖాస్తును మాత్రమే పరిణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. 

(4 / 5)

ఒకే కుటంబం నుంచి పలు దరఖాస్తులు రాగా… వీటిలో ఒక్క అప్లికేషన్ ను మాత్రమే లెక్కలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉమ్మడి కుటుంబం నుంచి వేరుగా ఉంటే మాత్రం…. వారి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ… వీలైనంత త్వరగానే ఈ స్కీమ్ పై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం కూడా భావిస్తోంది. 

(5 / 5)

ఒకే కుటంబం నుంచి పలు దరఖాస్తులు రాగా… వీటిలో ఒక్క అప్లికేషన్ ను మాత్రమే లెక్కలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉమ్మడి కుటుంబం నుంచి వేరుగా ఉంటే మాత్రం…. వారి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ… వీలైనంత త్వరగానే ఈ స్కీమ్ పై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం కూడా భావిస్తోంది. (Congress Twitter)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు