తెలుగు న్యూస్ / ఫోటో /
TS Govt Indiramma Indlu Scheme : త్వరలోనే అర్హులకు 'ఇందిరమ్మ ఇళ్లు' - తాజా అప్డేట్ ఇదే
- Telangana Indiramma Indlu Housing Scheme Updates: ఆరు గ్యారెంటీల హామీలపై ఫోకస్ పెట్టింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఇటీవలే ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ పథకాలను కూడా పట్టాలెక్కించింది. అయితే త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను అమలు చేయాలని భావిస్తోంది.
- Telangana Indiramma Indlu Housing Scheme Updates: ఆరు గ్యారెంటీల హామీలపై ఫోకస్ పెట్టింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఇటీవలే ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ పథకాలను కూడా పట్టాలెక్కించింది. అయితే త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను అమలు చేయాలని భావిస్తోంది.
(1 / 5)
గతేడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. పథకాల కోసం మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో అత్యధికంగా ఇళ్లు, చేయూత, రేషన్ కార్డుల కోసం ఎక్కువగా అప్లికేషన్లు వచ్చిన సంగతి తెలిసిందే.
(2 / 5)
గత ప్రభుత్వంలో ఇచ్చిన గృహలక్ష్మి దరఖాస్తులను కాంగ్రెస్ సర్కార్ రద్దు చేయడంతో.. వారంతా తిరిగి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు ఇచ్చారు. వీటి సంఖ్య 80 లక్షలకు పైగా ఉంది.
(3 / 5)
ఈ స్కీమ్ కింద గృహనిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందిచనుంది ప్రభుత్వం. ఈ స్కీమ్ పకడ్బందీగా అమలు చేయాలని చూస్తోంది. కుటుంబం నుంచి ఒకరిని మాత్రమే ఎంపిక చేయాలని భావిస్తోంది.
(4 / 5)
ఈ స్కీమ్ అమలుకు సంబంధి ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బుధవారం ఖమ్మంలో మాట్లాడిన ఆయన…. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను అమలు చేయబోతున్నామని చెప్పారు.
(5 / 5)
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అయితే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ… వీలైనంత త్వరగానే ఈ స్కీమ్ పై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం కూడా భావిస్తోంది. ఒకవేళ ఎన్నికల కోడ్ వస్తే మాత్రం… ఆ తర్వాతనే ఈ స్కీమ్ పట్టాలెక్కే అకాశం ఉంటుంది. (Congress Twitter)
ఇతర గ్యాలరీలు