(1 / 7)
తల్లికి వందనం స్కీమ్ పై ఏపీ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. తొలి విడతలో డబ్బులు రాని వారితో పాటు ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరిన వారికి రెండో విడత కింద డబ్బులను జమ చేయనుంది.
(2 / 7)
తల్లికి వందనం స్కీమ్ రెండో విడత నిధుల విడుదలపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. జూలై 10న ‘తల్లికి వందనం’ రెండో విడత నగదు విడుదల చేయాలని నిర్ణయించింది. దీంతో
10న తల్లుల ఖాతాల్లోకి నగదు జమ కానుంది.
(3 / 7)
ఇప్పటికే రెండో విడతకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను ఏపీ సర్కార్ సిద్ధం చేసింది. ఇక మొదటి విడతలో 67.27 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిన సంగతి తెలిసిందే.
(4 / 7)
అర్హులుగా గుర్తించిన విద్యార్థుల తల్లుల ఖాతాలో డబ్బులను జమ చేస్తున్నారు. ఈ స్కీమ్ కింద మొత్తం రూ. 15 వేలు ఇస్తుండగా… వీటిలో రూ. 13 వేలు తల్లి ఖాతాలో జమవుతాయి. మరో రూ. 2 వేలు జిల్లా కలెక్టర్ ఖాతాలోకి వెళ్తాయి. ఇదే విషయాన్ని ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది.
(5 / 7)
మరోవైపు తల్లికి వందనం స్కీమ్ స్టేటస్ చెక్ చేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ముందుగా https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP వెబ్ సైట్ లోకి వెళ్లాలి. వెబ్ సైట్ లోకి వెళ్లి తర్వాత… స్కీమ్ ఆప్షన్ లో తల్లికి వందనం పథకాన్ని ఎంచుకోవాలి. సంవత్సరం దగ్గర 2025-2026 ను ఎంపిక చేసుకోవాలి. ఆ పక్కన ఆధార్ నెంబర్ ను నమోదు చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేయాలి. ఆపై గెట్ ఓటీపీపై క్లిక్ చేస్తే మీ మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
(6 / 7)
పది వేల ఆదాయం లోపు వున్న తెల్ల రేషన్ కార్డుదారులకు, నెలకు 300 యూనిట్ల కరెంట్ బిల్లు దాటకుండా ఉండే కుటుంబాలకు ఈ స్కీమ్ వర్తింపజేస్తారు. 75 శాతం అటెండెన్స్ ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా అన్ని ధృవపత్రాలు, ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ ఉంటేనే డబ్బులు జమవుతాయి. ఇంట్లో ఫోర్ వీలర్ (ట్యాక్స్, ట్రాక్టర్, ఆటోలకు మినహాయింపు) ఉంటే అనర్హులవుతారు. ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ఉండొద్దు. ఆదాయపు పన్ను చెల్లించే వారికి కూడా స్కీమ్ వర్తింపజేయరు.
(7 / 7)
ఈ స్కీమ్ కింద ఒకటవ తరగతి నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఆర్థిక సహాయం కింద డబ్బులు జమ చేస్తారు. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు స్కూళ్లలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కూడా ఈ స్కీమ్ ను వర్తింపజేస్తారు. వీరి సంఖ్య రాష్ట్రంలో 70 వేలకుపైగా ఉంది.
ఇతర గ్యాలరీలు