Keerthy Suresh: రౌడీ జ‌నార్ధ‌న్‌కు హీరోయిన్ దొరికింది - విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో కీర్తి సురేష్ రొమాన్స్‌-keerthy suresh to play female lead in vijay devarakonda rowdy janardhana tollywood update ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Keerthy Suresh: రౌడీ జ‌నార్ధ‌న్‌కు హీరోయిన్ దొరికింది - విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో కీర్తి సురేష్ రొమాన్స్‌

Keerthy Suresh: రౌడీ జ‌నార్ధ‌న్‌కు హీరోయిన్ దొరికింది - విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో కీర్తి సురేష్ రొమాన్స్‌

Published Mar 27, 2025 02:05 PM IST Nelki Naresh
Published Mar 27, 2025 02:05 PM IST

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా రౌడీ జ‌నార్ధ‌న్ పేరుతో దిల్‌రాజు ఓ మూవీని తెర‌కెక్కిస్తోన్నాడు. మాస్ యాక్ష‌న్ మూవీకి ర‌వికిర‌ణ్ కోలా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌లే ఈ మూవీ టైటిల్‌ను దిల్‌రాజు అఫీషియ్‌గా అనౌన్స్ చేశారు.

రౌడీ జ‌నార్ధ‌న్ మూవీలో హీరోయిన్ క‌న్ఫామ్ అయిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా కీర్తి సురేష్ క‌థానాయిక‌గా క‌నిపించ‌నున్న‌ట్లు చెబుతోన్నారు.

(1 / 5)

రౌడీ జ‌నార్ధ‌న్ మూవీలో హీరోయిన్ క‌న్ఫామ్ అయిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా కీర్తి సురేష్ క‌థానాయిక‌గా క‌నిపించ‌నున్న‌ట్లు చెబుతోన్నారు.

గ‌తంలో మ‌హాన‌టి మూవీలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, కీర్తి సురేష్ న‌టించారు. ఇందులో కీర్తి సురేష్...సావిత్రిగా క‌నిపించ‌గా...ఆమె జీవితాన్ని వెలుగులోకి తీసుకొచ్చే జ‌ర్న‌లిస్ట్‌లుగా విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, స‌మంత  క‌నిపించారు.

(2 / 5)

తెలుగులో చివ‌ర‌గా భోళాశంక‌ర్ సినిమాలో కీర్తి సురేష్ న‌టించింది. దాదాపు రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత  రౌడీ జ‌నార్ధ‌న్‌తో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది.

(3 / 5)

తెలుగులో చివ‌ర‌గా భోళాశంక‌ర్ సినిమాలో కీర్తి సురేష్ న‌టించింది. దాదాపు రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత రౌడీ జ‌నార్ధ‌న్‌తో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది.

ఇటీవ‌లే బేబీ జాన్ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తేరీ మూవీకి రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

(4 / 5)

ఇటీవ‌లే బేబీ జాన్ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తేరీ మూవీకి రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

ప్ర‌స్తుతం తెలుగులో ఉప్పుక‌ప్పురంబు పేరుతో కీర్తి సురేష్ ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది. ఈ వెబ్‌సిరీస్‌లో సుహాస్ ఓ కీల‌క పాత్ర చేస్తోన్నాడు.

(5 / 5)

ప్ర‌స్తుతం తెలుగులో ఉప్పుక‌ప్పురంబు పేరుతో కీర్తి సురేష్ ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది. ఈ వెబ్‌సిరీస్‌లో సుహాస్ ఓ కీల‌క పాత్ర చేస్తోన్నాడు.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు