Keerthy Suresh: బాలీవుడ్ డెబ్యూ మూవీ కోసం రెమ్యునరేషన్ పెంచేసిన కీర్తిసురేష్ - ఎంత డిమాండ్ చేసిందంటే?
టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది కీర్తిసురేష్. ఈ ఏడాది తేరీ రీమేక్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ రీమేక్‌కు బేబీ జాన్ అనే టైటిల్ ఖరారు చేశారు.
(1 / 5)
తేరీ రీమేక్ బేబీ జాన్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తోన్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోన్న ఈ మూవీకి కలీస్ దర్శకత్వం వహిస్తున్నాడు. మే 31న ఈ బాలీవుడ్ మూవీ రిలీజ్ కాబోతోంది.
(2 / 5)
బేబీ జాన్‌లో కీర్తిసురేష్‌తో పాటు వామిక గబ్బి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరోయిన్‌గా కీర్తిసురేష్‌కు ఇదే ఫస్ట్ బాలీవుడ్ మూవీ కావడం గమనార్హం.
(3 / 5)
ఈ బాలీవుడ్ డెబ్యూ మూవీ కోసం కీర్తిసురేష్ తన రెమ్యునరేషన్ పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బేబీ జాన్ కోసం కీర్తిసురేష్ నాలుగు కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు చెబుతున్నారు.
(4 / 5)
ప్రస్తుతం తమిళంలో ఒక్కో మూవీ కోసం కీర్తిసురేష్ రెండు కోట్లు రెమ్యునరేషన్ స్వీకరిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ మూవీ కోసం రెమ్యునరేషన్ డబుల్ చేసినట్లు చెబుతోన్నారు.
ఇతర గ్యాలరీలు