తెలుగు న్యూస్ / ఫోటో /
Keerthy Suresh: తేరీ రీమేక్ కంటే ముందు కీర్తి సురేష్ రిజెక్ట్ చేసిన బాలీవుడ్ సినిమాలు ఇవే!
Keerthy Suresh: బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్‌లో తొలి అడుగు వేయబోతున్నది కీర్తిసురేష్. దళపతి విజయ్ హీరోగా తమిళంలో విజయవంతమైన తేరీ రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తోన్నాడు. బేబీ జాన్ కంటే ముందు కీర్తి సురేష్ రిజెక్ట్ చేసిన ఆ బాలీవుడ్ మూవీస్ ఏవంటే?
(1 / 5)
అజయ్ దేవ్‌గణ్ మైదాన్ మూవీలో హీరోయిన్‌గా కీర్తిసురేష్‌కు అవకాశం వచ్చింది. మిడిల్ ఏజ్ మహిళ పాత్రకు సెట్ కాకపోవడంతో కీర్తిసురేష్ స్థానంలో ప్రియమణిని తీసుకున్నారు మేకర్స్.
(2 / 5)
రానా దగ్గుబాటి హీరోగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో ఓ తెలుగు, హిందీ బైలింగ్వల్ మూవీ ప్లాన్ చేశాడు. ఈ కొరియన్ రీమేక్‌లో నటించడానికి కీర్తిసురేష్ తిరస్కరించినట్లు సమాచారం.
(3 / 5)
ప్రస్తుతం హిందీలో యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోన్న వెబ్‌సిరీస్‌లో కీర్తిసురేష్ లీడ్ రోల్ చేస్తోంది. ఈ సిరీస్‌లో రాధికా ఆప్టే ఓ కీలక పాత్ర పోషిస్తోంది.
(4 / 5)
హిందీలో రివాల్వర్ రీటా, రఘుతాతతో పాటు మరో సినిమా చేస్తోంది కీర్తిసురేష్. ఈ మూడు సినిమాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ఇతర గ్యాలరీలు