Keerthy Suresh: పెళ్లయ్యాక కీర్తి సురేష్ లో ఎంత మార్పు? బోల్డ్‌గా ట్రెండీగా ఫోటోలకు ఫోజులు
హీరోయిన్ కీర్తి సురేష్ అక్కా అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటించింది. టీజర్ లాంచ్ లో ఆమె తెలుపు రంగు చీర కట్టుకొని కనువిందు చేసింది. ఈ చీరలో ఆమె ఎంతో అందంగా, ట్రెండీగా కనిపిస్తోంది.
(1 / 5)
గత ఏడాది డిసెంబర్ లో కీర్తి సురేష్ తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనిని వివాహం చేసుకుంది.పెళ్లి తర్వాత కీర్తి బాలీవుడ్ ఎంట్రీ బేబీ జాన్ విడుదలైంది. తమిళ తెరి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది. అయితే కీర్తికి బాలీవుడ్ లో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ప్రస్తుతం బాలీవుడ్ ఓటీటీ వెబ్ సిరీస్ లో నటిస్తోంది.
(Twitter)(2 / 5)
రాధికా ఆప్టే, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'అక్క' టీజర్ విడుదలైంది. చేతిలో తుపాకీ, మెడలో పులి దంతాలతో లేడీ డాన్ గా కీర్తి లుక్ అభిమానులను ఆకట్టుకుంది.
(All Pics @Instagram/Keerthy Suresh)(3 / 5)
అక్క టీజర్ లాంచ్ కు హాజరైన కీర్తి సురేష్ చీర, స్లీవ్ లెస్ బ్లౌజ్ తో చాలా గ్లామరస్ గా కనిపించింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ఫోటోగ్రాఫర్లు కీర్తి సురేష్ ఫోటోలు క్లిక్ మనిపించారు.
(4 / 5)
ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ను యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల కానున్న ఈ సిరీస్ విడుదల తేదీ గురించి నెట్ ఫ్లిక్స్ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
ఇతర గ్యాలరీలు