210 అడుగులతో రెండు వైపులా ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రయాణికుల కోసం వెయిటింగ్ లాంజ్, ఏసీ ప్రయాణికులు వెయిటింగ్ కోసం ప్రత్యేకంగా గదులు నిర్మిస్తున్నారు.
Kazipet Railway Junction Station : కాజీపేట్ రైల్వే జంక్షన్ లుక్ మారుతోంది..! ఈ ఫొటోలు చూడండి
- Kazipet Railway Station Redeveloped:“ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” లో భాగంగా రైల్వే శాఖ పలు రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోంది. ఇందులో భాగంగా కాజీపేట్ రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఇప్పటివరకు 40 శాతం పనులు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలు, ఫొటోలు ఇక్కడ చూడండి..
- Kazipet Railway Station Redeveloped:“ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” లో భాగంగా రైల్వే శాఖ పలు రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోంది. ఇందులో భాగంగా కాజీపేట్ రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఇప్పటివరకు 40 శాతం పనులు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలు, ఫొటోలు ఇక్కడ చూడండి..
(1 / 7)
రైల్వే ప్రయాణీకులకు సరికొత్త అనుభూతితో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను భారత రైల్వే చేపడుతోంది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది.
(2 / 7)
ఈ స్కీమ్ లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉన్న కాజీపేట్ రైల్వే స్టేషన్ రూపురేఖలను మార్చేలా మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఇప్పటికే పనులు కొనసాగుతున్నాయి. అయితే ఈ పనులు ప్రగతికి సంబంధించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొన్ని ఫొటోలను షేర్ చేశారు.
(3 / 7)
కాజీపేట రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు ఇప్పటి వరకు 40 శాతం పూర్తి అయినట్లు తెలిపారు. మొత్తం 24.5 కోట్ల రూపాయాలతో ఈ అభివృద్ధి పనులు జరగనున్నాయని వెల్లడించారు. అయితే ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను పోస్ట్ చేశారు.
(4 / 7)
రైల్వే స్టేషన్ ముఖద్వారాల అభివృద్ధి, ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారాలను ఈ స్కీమ్ లో భాగంగా ఏర్పాటు చేయనున్నారు. స్టేషను ఆవరణలో పచ్చదనాన్ని పెంచడం, ల్యాండ్ స్కేపింగ్ వంటి వాటిని అభివృద్ధి చేస్తారు. పార్కింగ్ కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఆ దిశగా పనులు కొనసాగుతున్నాయి.
(5 / 7)
ప్రయాణికులు చేరుకోవటానికి, స్టేషన్ నుంచి వెళ్లేందుకు వీలుగా ఆటో స్టాండ్, కార్ పార్కింగ్, టూ వీలర్ పార్కింగ్‌లను విశాలంగా నిర్మిస్తున్నారు. ఎయిర్‌పోర్టు తరహాలో వెహికల్స్ నేరుగా స్టేషన్ ముందుకు వచ్చి ప్రయాణికులను దింపి వెళ్లే విధంగా నిర్మాణాలు చేపడుతున్నారు.
(6 / 7)
స్టేషన్‌లో ఎక్కడా ఖాళీ లేకుండా కవర్ ఓవర్ ప్లాటుఫారం(షెడ్లు) నిర్మిస్తున్నారు. కాజీపేటలో రెండు ప్లాట్‌ఫారాల మధ్య వెళ్లడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు సైతం నిర్మిస్తున్నారు. ఈ పనులు కూడా పట్టాలెక్కాయి.
ఇతర గ్యాలరీలు